రాయలసీమ ద్రోహి చంద్రబాబు గో బ్యాక్.. పరువు పోయిందిగా బాబు!

చంద్రబాబు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ రాయలసీమ జిల్లాలకు ఆయన వల్ల కలిగిన లాభం దాదాపుగా శూన్యం అనే సంగతి తెలిసిందే. జగన్ పాలనలో రాయలసీమ జిల్లాలకు మరీ భారీ స్థాయిలో లబ్ధి చేకూరకపోయినా చంద్రబాబు పాలనతో పోల్చి చూస్తే మాత్రం మెరుగైన పాలన అని అందుతోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబుకు భారీ షాక్ తగిలింది.

రాయలసీమ ద్రోహి చంద్రబాబు గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేయడంతో పాటు చంద్రబాబు కాన్వాయ్ ముందు బైఠాయించారు. కర్నూలును న్యాయ రాజధాని చేయడంపై చంద్రబాబు పెదవి విప్పాలంటూ కామెంట్లు చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు సంబంధించి చంద్రబాబు నోరు విప్పాలంటూ నినాదాలు చేశారు. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ కర్నూలు ప్రజలు నిరసన చేపట్టారు.

చంద్రబాబు పర్యటన భారీ సక్సెస్ అని ప్రచారం చేసుకుంటున్న ఎల్లో మీడియకు భారీ షాక్ అనే చెప్పాలి. చంద్రబాబుకు రాయలసీమలో ఎలాంటి ఇమేజ్ ఉందో సులువుగానే అర్థమవుతుంది. రాయలసీమ ద్రోహిగా చంద్రబాబుపై ముద్ర పడిందంటే చంద్రబాబు పరువు ఒక విధంగా పోయినట్టేనని కొంతమంది కామెంట్లు చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

చంద్రబాబు నాయుడు మూడు రాజధానులకు మద్దతు ఇవ్వని పక్షంలో 2024 ఎన్నికల ఫలితాల్లో కూడా భారీ షాక్ తప్పదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు రెండు కళ్ల సిద్ధాంతాన్ని పక్కన పెట్టి నీతి మార్గంలో రాజకీయాలు చేయాల్సిన సమయం ఆసన్నమైందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.