మంత్రుల్లో ఎంతమందికి డేంజర్ సిగ్నల్ ?

మంత్రివర్గంలోని చాలామందికి రాబోయే ఎన్నికల్లో గెలుపుపై టెన్షన్ పడుతున్నట్లు సమాచారం. చాలామంది మంత్రులు తమ నియోజకవర్గాల్లో ప్రచారంలోనే ఎదురీదుతున్నారట. ప్రచారంలోనే మంత్రులను అడ్డుకుంటున్న జనాలు ఇక వారికి ఓట్లేస్తారా ? అన్నదే అనుమానం. చంద్రబాబునాయుడు మంత్రివర్గంలోని 25 మందిలో అత్యధికులు గెలుపుకు ఎదురీదుతున్నారని సమాచారం.

ఉత్తరాంధ్రలోని  నాలుగురు మంత్రులు అచ్చెన్నాయుడు, కిమిడి కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడుకి గెలుపు కష్టమనే అంటున్నారు. ప్రజా వ్యతిరేకతకు తోడు అచ్చెన్న, కిమిడి, గంటాల అవినీతి కూడా ప్రధాన కారణమంటున్నారు. అలాగే ఉభయగోదావరి జిల్లాల్లోని నిమ్మకాయల చిన్నరాజప్ప, యనమల రామకృష్ణుడు తమ్ముడు యనమల కృష్ణుడు, పితాని సత్యనారాయణ, జవహర్ కు గెలుపు అంత ఈజీ కాదట. నిమ్మకాయల, జవహర్ నైతే ప్రచారంలోనే అడ్డుకుంటున్నారట.

రాజధాని జిల్లాలైన కృష్ణా, గుంటూరులో పత్తిపాటి పుల్లారావు విషయం ఇపుడే చెప్పలేకున్నారట. దేవినేని, నక్కా ఆనందబాబు కష్టమని అంటున్నారు. ఇక కొల్లు రవీంద్ర విషయం కూడా చెప్పలేమంటున్నారు. రాయలమసీకు వస్తే భూమా, కెఇ కృష్ణమూర్తి కొడుకు కెఇ శ్యాంబాబు, కడప ఎంపిగా పోటీ చేస్తున్న ఆది నారాయణరెడ్డి, కాలువ శ్రీనివాసులు కష్టమనే అంటున్నారు. పరిటాల సునీత స్ధానంలో పోటీ చేస్తున్న కొడుకు శ్రీరామ్ విషయంలో కాస్త కఫ్యూజన్ ఉంది.

ఇక మంగళగిరిలో పోటీ చేస్తున్న నారా లోకేష్ కూడా కచ్చితంగా గెలుస్తాడని చెప్పలేకున్నారు. లాజికల్ గా అయితే ఇక్కడ లోకేష్ గెలుస్తాడని చెప్పేందుకు లేదు. కానీ గెలుపు చంద్రబాబునాయుడు చాలా ప్రిస్టేజ్ గా తీసుకున్నారు. అందుకనే కోట్ల రూపాయలు ఖర్చ చేస్తున్నారు. అయినా గెలుపు పై గ్యారెంటీ లేదంటే పరిస్ధితేమిటో అర్ధం చేసుకోవచ్చు. మొత్తం మీద చూడబోతే చంద్రబాబుతో కలిపి మహా అయితే ఓ నలుగురు మంత్రులు గెలిస్తే అదే గొప్పట. చూద్దాం ఏం జరుగుతుందో ?