చంద్ర బాబు రాజకీయ వ్యూహం నెరవేరింది 

నందమూరి హరికృష్ణ హఠాత్తుగా రోడ్ ప్రమాదంలో మరణించడం చంద్ర బాబుకు వరంగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు . నందమూరి కుటుంబంలో అధికారం కోసం పురందరేశ్వరి , హరికృష్ణ ఆరాట పడ్డారు . అయితే బాబుకు దగ్గుబాటి వచ్చిన విభేదాలతో పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయింది . ఈ నేపథ్యంలో చంద్ర బాబు బాలకృష్ణ కూతురు బ్రాహ్మణిని తన కోడలుగా చేసుకొని బావమరిది బాలకృష్ణను శాసన సభ్యుడుగా చేశాడు . మిగిలింది హరికృష్ణ ,ఆయన కుమారుడు తారక రామారావు. 2009 ఎన్నికల ముందు హరికృష్ణకు రాజ్య సభ టికెట్ ఇచ్చి గెలిపించాడు . జూనియర్ ఎన్టీయార్ ను ప్రచారానికి వాడుకొని వదిలేచాడు .తెలంగాణ ఉద్యమం సందర్భంగా  హరికృష్ణ  తన పదవికి రాజీనామా చేశాడు . అప్పటినుంచి హరికృష్ణ , జూనియర్ ఇద్దరు దూరంగానే వుంటున్నారు . కంటి తుడుపుగా హరికృష్ణకు పొలిట్ బ్యూరో సభ్యుడని అన్నారు . కానీ హరికృష్ణ  ఎప్పుడు సమావేశాలకు వెళ్ళలేదు . మొన్న విజయవాడలో జరిగిన  మహానాడుకు కూడా హరికృష్ణ డుమ్మా కొట్టాడు . చంద్రబాబుతో విసిగిపోయిన హరి కృష్ణ 

వై ఎస్ ఆర్  కాంగ్రెస్ పార్టీలో చేరతాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి . జూనియర్ కు అత్యంత  సన్నిహితుడైన కొడాలి నాని ప్రోత్సాహం తో హరికృష్ణ ,జూనియర్ ఇద్దరు ఆ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైందని విశ్వసనీయ సమాచారం. మరోవైపు పురందరేశ్వరి , ఆమె కుమారుడు ఇద్దరు కూడా వై ఎస్ ఆర్  కాంగ్రెస్ పార్టీలో చేరతారని జగన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం కూడా జరుగుతుంది . అందుకే జగన్ పాద యాత్ర సందర్భంగా కృష్ణ జిల్లా నిమ్మకూరు వెళ్ళినప్పుడు ఆజిల్లాకు నందమూరి తారక రామా రావు పేరుపెడతానని ప్రకటించాడు .  జగన్ కు ప్రజల్లో  పట్టు వస్తుందని , ఆ సానుభూతి ఓట్లుగా మారితే ప్రమాదమని చంద్ర బాబు గ్రహించాడు . ఇక భారతీయ జనతా పార్టీతో వున్న బంధం కూడా తెగిపోయింది . గత కొన్నాళ్లుగా చంద్ర బాబు చాలా అసహనంగా ఉండటానికి కారణం వచ్చే ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ విజయాలపై ఆయనకు నమ్మకం సన్నగిల్లడమే . 

ఈ పరిస్థితుల్లో హరికృష్ణ చనిపోయాడు . ఇంతకాలం హరికృష్ణను, జూనియర్ ను పట్టించుకోని చంద్ర బాబు ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు . రెండు రోజుల పాటు బాబు హైదరాబాద్ లోనే  ఉండి  రాజకీయ వ్యూహం పకడ్బందిగా  అమలు చేశాడు. 

నందమూరి కుటుంబానికి తాను  ఎంతో సన్నిహితమని చెప్పడానికే హరికృష్ణ పాడే మోశాడు . అంతేకాదు హరికృష్ణ భౌతిక కాయం వున్న వాహనంలో  గంటన్నర పాటు నుంచొని మహాప్రస్థానం వరకు వెళ్ళాడు . దగ్గర ఉండి కర్మకాండ జరిపించాడు . ఈ విధంగా తెలుగు ప్రజలు తన మనసులో వున్న పథకాన్ని సందేశం రూపంలో అందించాడు . 

తనకు ఎదురు నిలబడే హరికృష్ణ లేడు . తండ్రి లేని తరువాత జూనియర్ వై ఎస్ ఆర్  కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళడు . ఒక్క పురందేశ్వరి ఏ పార్టీలోకి వెళ్లినా చంద్ర బాబు లెక్క చేయడు . కాబట్టి చంద్ర బాబుకు ఇప్పుడు అడ్డు లేదు . తెలుగుదేశం పార్టీ పై పూర్తి పట్టు వచ్చేసింది . బాలకృష్ణ తన వెనుక ఎలాగూ వున్నాడు . 

తెలుగు దేశం పార్టీని స్వర్గీయ నందమూరి తారక రామారావు 1982లో స్థాపించాడు . 1983లో రామారావు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చాడు . 1984లో నాదెండ్ల భాస్కరరావు రామారావు అమెరికా వెళ్లిన సందర్భంగా తాను  ముఖ్యమంత్రి పదవిలో కూర్చున్నాడు . భాస్కరరావును దించడానికి అందరు ఏకమయ్యారు . 1995 ఆగస్టులో చంద్ర బాబు నాయుడు తన మామ రామారావును పార్టీ నుంచి, ప్రభుత్వం నుంచి తప్పించి ముఖ్య మంత్రి అయ్యాడు . ఆ భాధ తో రామారావు 1996 జనవరి 18న చనిపోయాడు . చంద్ర బాబు అసలు రూపం హరికృష్ణను అర్థమైంది . అన్న తెలుగు దేశం పార్టీ పెట్టి పోరాడాలని అనుకున్నాడు . కానీ విజయం సాధించలేదు . తాత్కాలికంగా బావతో రాజీపడ్డాడు . అప్పటినుంచి  నందమూరి కుటుంబానికి నారా కుటుంబానికి మధ్య రాజకీయ పోరాటం జరుగుతూనే వుంది .  ఇక హరికృష్ణ మరణించడంతో తెలుగు దేశం పార్టీ నారా కుటుంబ ఆస్తి అయిపొయింది . ఏమైనా చంద్ర బాబు నాయుడు రాజకీయ చాణిక్యుడు