వచ్చే నెలలోనే మునుగోడు ఎన్నిక.. గెలిచేది ఆ పార్టీనేనా?

తెలంగాణ రాష్ట్రంలో మరికొన్ని రోజుల్లో జరగనున్న మునుగోడు ఉపఎన్నిక ప్రజల్లో నెలకొన్న ఎన్నో ప్రశ్నలకు సమాధానం ఇవ్వనుంది. మునుగోడు ఉపఎన్నికలో విజయం సాధిస్తే రాష్ట్రంలో ప్రజల మద్దతు తమ పార్టీకే ఉందని ప్రూవ్ చేసుకోవచ్చని చాలమంది భావిస్తున్నారు. ప్రధానంగా బీజేపీ, టీ.ఆర్.ఎస్. మధ్య పోటీ ఉండగా ఈ రెండు పార్టీలలో ప్రస్తుతం టీ.ఆర్.ఎస్.కే అనుకూల ఫలితాలు వచ్చే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

అయితే ఇదే సమయంలో బీజేపీని తక్కువగా అంచనా వెయ్యడానికి వీలు లేదు. బీజేపీ మరింత కష్టపడితే ఆ పార్టీకే ఎన్నికల్లో అనుకూలంగా ఫలితాలు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నవంబర్ నెలలోనే ఉపఎన్నిక జరగనుందని బీజేపీ, టీ.ఆర్.ఎస్ నేతలు చెబుతున్న విషయాల ద్వారా అర్థమవుతోంది. ప్రముఖ పార్టీల కీలక నేతలు ఇప్పటికే మునుగోడుకు మకాం మార్చారు.

ఎన్నికల్లో గెలవడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి టీ.ఆర్.ఎస్, బీజేపీ కృషి చేస్తున్నాయి. బీజేపీ ముఖ్య నేతలు సైతం ఎన్నికల్లో విజయం సాధించడం కోసం ఖర్చు విషయంలో రాజీ పడటం లేదని తెలుస్తోంది. దేశంలోనే మునుగోడు ఖరీదైన ఉపఎన్నిక కానుందని సమాచారం అందుతోంది. ప్రతి పార్టీ ఒక ఓటుకు 10,000 రూపాయల కంటే ఎక్కువ మొత్తం ఇవ్వనుందని బోగట్టా.

ఈ నియోజకవర్గంలో మద్యం ఏరులై పారుతోందని తెలుస్తోంది. గత కొన్ని నెలల్లో ఈ నియోజకవర్గంలో మద్యం సేల్స్ ఊహించని స్థాయిలో పెరిగాయని సమాచారం. టీ.ఆర్.ఎస్ నేతలు మునుగోడులో ఓటర్లను ప్రత్యక్షంగా కలిసి ఓటర్ల గెలుపు కోసం తమ వంతు కృషి చేయనున్నారని తెలుస్తోంది. కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ ఎన్నికల్లో తమకు అనుకూల ఫలితాలు రావడం కష్టమేనని భావిస్తున్నట్టు బోగట్టా.