రాష్ట్రంలో నడుస్తన్న హాట్ టాపిక్ మూడు రాజాధానులు. గవర్నర్ ఆమోదం తెలపడంతో అమరావతి నుండి పాలనా రాజధాని, న్యాయ రాజధానిని తరలించే ఏర్పాట్లు చేసుకోవచ్చని ప్రభుత్వం భావించింది. ఆగష్టు 15న ముహూర్తం ఖరారు చేసింది. ఈ నిర్ణయం సరైంది కాదని ప్రతిపక్షాలు టీడీపీ, జనసేనలు ఖండిస్తున్నాయి. అమరావతి రైతులు తమ నిరసనను తీవ్రతరం చేశారు. ఈ బిల్లుతో పాటు సీఆర్డీయే రద్దు బిల్లు కూడా రాజ్యాంగబద్దం కాదని వాదిస్తూ ఉన్నారు. గవర్నర్ విడుదల చేసిన గెజిట్ నిలిపివేయాలను హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి.
మొత్తం మూడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈరోజు కూడా మరొక పిటిషన్ దాఖలైంది. దీంతో మొత్తం నాలుగు పిటిషన్లను ఈరోజు విచారణకు స్వీకరించింది. మధ్యాహ్నం ఇరు వర్గాల నడుమ వాదోపవాదనలు జరగ్గా వాదనలు విన్న ధర్మాసనం ఈ నెల 14 వరకు రాజధానుల బిల్లుపై స్టే విధించింది. ఈ పది రోజుల్లో రాజధానిని తరలించే అవకాశం ఉందని హైకోర్టు ముందు పిటిషనర్లు వాదనలు వినిపించారు. దీంతో 14 వరకు రాజధాని విషయంలో యధాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు తెలిపింది పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి తెలిపింది.
హైకోర్టు నిర్ణయంతో గవర్నర్ గెజిట్ కు బ్రేకులు పడినట్టైంది. దీంతో హడావుడిగా రాజధానిని విశాఖకు తరలించాలనే ప్రభుత్వ ఉద్దేశ్యానికి అడ్డు ఏర్పడింది. ఈ పరిణామంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతులకు, రాజకీయ పార్టీలకు తాత్కాలిక ఊరట లభించింది. ప్రభుత్వం ఆమోదించిన బిల్లులు కోర్టులో జరిగే న్యాయ పోరాటంలో నిలబడవని కొందరు అంటే అంతా రాజ్యాంగం ప్రకారమే ఉంది కాబట్టి ఎలాంటి అడ్డంకి ఉండదని ఇంకొందరు అంటున్నారు. దీంతో ప్రభుత్వం తరపున దాఖలు కాబోయే కౌంటర్లో ఎలాంటి వాదనలు వినిపిస్తుందో అనే ఆసక్తి నెలకొంది.