నోరు జారిన ఉపేంద్ర… దళితులకు సారీ!

ఈమధ్యకాలంలో తమదైన అజ్ఞానంతో పబ్లిక్ లో బయటపెట్టడానికి కొంతమంది సినీ నటులు అత్యుత్సాహం చూపిస్తున్నారనే కామెంట్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరిలో మరి ముఖ్యంగా… రాజకీయాల్లోకి రావాలని, వచ్చినవారు రాజ్యాలు ఏలాలని కలలు గంటుంటారు. నిజజీవితానికీ సినిమాళ్లో నటించడానికీ ఉన్న తేడాని మరిచిపోతుంటారు!

ఇందులో భాగంగా… తలా తోకా లేకుండా తాను ఏమి చెప్పినా జనం గుడ్డిగా నమ్మేస్తారనే భ్రమంలో బ్రతుకుతున్నారు. ఈ సమయంలో జనం నుంచి భారీ రియాక్షన్ రావడంతో కొంతమంది మాటమార్చి.. అబ్బే తన మాటల ఉద్దేశ్యం అది కాదని నాలుక కరుచుకుంటారురు. ఇంకొంతమందిమంది నిస్సిగ్గుగా చేసిన తప్పుడు విమర్శలను కవర్ చేసుకుంటూ ఉంటారు.

మరికొంతమంది మాత్రం బహిరంగంగా సారీ చెబుతున్నారు. ఈ లిస్ట్ లో తాజాగా కన్నడ నటుడు ఉపేంద్ర చేరారు! తన అజ్ఞానంతో మాట్లాడిన ఒక మాట ఈ రోజుల్లో మాట్లాడకూడనిదని గ్రహించలేకపోయాడు. ఫలితంగా క్షమాపణలు చెప్పాడు. సిగ్గుతో తలదించుకున్నాడు!!

ఆ మ‌ధ్య ఒక రాజ‌కీయ పార్టీ పెట్టి.. కొన్ని రోజుల వ్యవ‌ధిలోనే ఆ పార్టీ నుంచి త‌నే రాజీనామా చేసి బ‌య‌ట‌కు వ‌చ్చారు ఉపేంద్ర. ఇదో రకం డిఫరెంట్ పొలిటీషియన్ అన్నమాట! అయినా కూడా ఆత్రం ఆగకోఏమో కానీ… అప్పుడప్పుడూ ఫేస్ బుక్ లైవ్ లో త‌న పార్టీ వైఫ‌ల్యం గురించి మాట్లాడుతుంటారు. ఈ ప్రయత్నంలో తాజాగా ఒక ముతక సామెత వాడారు!

“ఎక్కడైనా కొంద‌రు చెడ్డవాళ్లుంటారు. వారిని ఇగ్నోర్ చేయాలి. ఊర‌న్నాకా.. ద‌ళితుల ఇళ్లు కూడా ఉంటాయి క‌దా..” ఇదీ ఉపేంద్ర నోటి నుంచి క‌న్నడ‌లో జాలు వారిన మాట‌లు! దీంతో… ఇలాంటి అర్ధం పర్ధం లేని ముతక సామెతలు వాడటం ఎంతవరకూ కరెక్ట్ అంటూ వాయించి వదిలారు. తీవ్రసత్ఘాయిలో కన్నడనాట దళిత వర్గాలు ఫైరయ్యాయి.

త‌న రాజకీయ వైఫ‌ల్యానికి, తన చేతకాని తనానికి ఎవరో కొంద‌రు కార‌ణ‌మ‌న్నట్లుగా చెప్పుకునే చాలా మంది నాయకుల్లా.. ఉపేంద్ర కూడా ఇలా మంగళవారం మాటల ప్రయత్నం చేశారు. అలాంటి వారు అంత‌టా ఉంటార‌న్నట్టుగా.. చెప్పి దానికి, మ‌ధ్యలో ద‌ళితుల ఇళ్లు అంటూ పనికిమాలిన సామెత‌ను చెప్పాడు. తాను పాతకాలం మనిషిని అని చెప్పుకునే ప్రయత్నం చేశారు!

దీంతో… దళిత వర్గాల నుంచి నిరసన వ్యక్తం అయ్యింది. కన్నడ రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి! పోస్టర్లు దగ్దమయ్యాయి.. ఫోటోలకు చెప్పులు దండలు పడ్డాయి! దీంతో తాను ఎంత తప్పుడు మాట మాట్లాడానో గ్రహించిన ఉపేంద్ర సారీ చెప్పాడు. త‌ను వాడిన సామెత కొంద‌రిని బాధ‌పెట్టింద‌ని.. క్షమించండి అని పోస్టు పెట్టాడు.