మరో సంచలన బాంబు పేల్చిన శివాజీ

సినీనటుడు శివాజీ బుధవారం మీడియా ముందుకు వచ్చారు. చంద్రబాబు సర్కార్ పై మరోసారి కుట్రకు పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్ని రకాలుగా దాడులు అయిపోయి, 2016 లో ఈ ప్రభుత్వంపై కొత్త తరహాలో కుట్రకు ప్లాన్ చేశారు.

ఓటర్లను దూరం చేయడం ఎలాగా? దానికోసం ఒక వ్యక్తితో వాళ్ళే కేసులు వేయించారు. దానికి సంబంధిన ఆధారాల ఫైల్ ను ముఖ్యమంత్రికి అందజేయనున్నాను అని తెలిపారు శివాజీ. అయితే ఆ ఇష్యూ మీద న్యాయం చేయడానికి సీఎం ఆసక్తిగా ఉన్నప్పటికీ నలుగురు మాత్రం దీనికి అడ్డుపడుతున్నారు అన్నారు. ఇంతకీ ఆ కుట్ర ఏమిటి? ఈ విషయంపై మరింత సమాచారం కోసం కింద ఉన్న మ్యాటర్ చదవండి.

చుక్కల భూములు, కుంటల భూముల పేర్లుతోటి ప్రజల దగ్గర నుండి వారి భూములు లాక్కోవడానికి జిఓ రూపంలో 22 A సర్వే నంబర్ లో రిజిస్ట్రేషన్స్ రద్దు చేశారు. ప్రభుత్వం భూములు అయితే లాక్కునే రైట్ ఉంది కానీ ఈ 22 A సర్వే నంబర్ లో ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రాంతాల వారీగా విభజించి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన భూముల్ని రెగ్యులరైజ్ చేస్తూ 1880 లో ఈస్ట్ ఇండియా కంపెనీ జిఓ చేసింది.

కానీ మన దగ్గర ఉన్న అధికారులు దానిని బయటకు రాకుండా తొక్కిపెట్టారు. అది కేవలం కుట్రలో భాగమే అని ఆరోపించారు. ప్రభుత్వాన్ని బదనాం చేసి, ప్రజల్ని ప్రభుత్వం నుండి దూరం చేసి మూడులక్షల రైతుల కుటుంబాల ఓట్లను దూరం చేయగలిగితే ప్రభుత్వం కూలిపోతుంది. ఆ ముగ్గురు అధికారుల పేర్లు నేను సేకరించాను. అందులో నిజం ఉంటె ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తీసుకోవాలి కూడా.. ఎందుకంటే రైతుల కుటుంబాలకి సంబంధించిన 12 లక్షల మంది జనాభాకి సంబంధించిన అంశం ఇది.

1910 వ సంవత్సరం నుండి 2016 వరకు నిరాటంకంగా ఈ భూముల మీద రిజిస్ట్రేషన్స్ జరిగాయని వీలు చెబుతున్న డాక్యుమెంట్స్ కానీ రికార్డ్స్ కానీ అధికారుల దగ్గర లేవు. కొన్ని మాత్రమే ఉన్నాయి వాటిని కూడా తొక్కి పెట్టారు అని అన్నారు శివాజీ. ఆ రికార్డ్స్ తెలంగాణ ప్రభుత్వం అధీనంలో ఉన్న ఒక వ్యక్తి ద్వారా రీసర్వే రికార్డ్ (ఆర్ఎస్ఆర్) ని నేను పట్టుకున్నాను. దానిలో ఉన్న భూముల వివరాలన్నీ క్లియర్ గా ఉన్నాయి. ఈ విషయాల్ని ప్రముఖ పత్రికలు బయట పెట్టాయి. దీనిపై ముఖ్యమంత్రికి తెలియజేయడానికి నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను. సాక్ష్యాలన్నీ ఆయనకు చూపిస్తాను అని తెలిపారు శివాజీ.