విరాళంలోను హెరిటేజ్ రాజకీయం..మరీ అంత చీప్ గానా ?

తన బావ చంద్రబాబునాయుడుకన్నా తానే గొప్పోడని బావమరిది బాలకృష్ణ నిరూపించుకున్నారు. తిత్లీ తుపాను బాధితుల సహాయార్ధాం సినీ నటుడు, చంద్రబాబునాయుడు బావమరిది, హిందుపురం ఎంఎల్ఏ నందమూరి బాలకృష్ణ వ్యక్తిగతంగా రూ 25 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. అందరినీ విరాళాలు ఇవ్వమని కోరుతున్న చంద్రబాబు, చినబాబు లోకేష్ తాము మాత్రం ఒక్కరూపాయి కూడా విరాళం ప్రకటించలేదు. వ్యక్తిగతంగానే కాదు కనీసం హెరిటేజ్ సంస్ధ తరపున కూడా విరాళం ప్రకటించకపోవటంపై అన్నీ వైపుల నుండి పెద్ద ఎత్తున విమర్శలు మొదలయ్యాయి.

 

తిత్లీ తుపాను బాధితులను ఆదుకునేందుకు తన వంతుగా ముఖ్యమంత్రి సహాయ నిధికి బాలయ్య నాలుగు రోజుల క్రితం విరాళం ప్రకటించారు. తుపాను తీవ్రతతో కష్టాల్లో ఉన్న ప్రజలు ఆదుకునేందుకు సినీ ఇండస్ట్రీ నుండి ఇప్పటికే కార్తికేయ, ఎన్టీయార్, కల్యాణ్ రామ్, వరుణ్ తేజ్, సంపూర్ణేష్ బాబు, నిఖిల్, విజయ్ దేవరకొండ ఆర్దిక సాయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సినీ పరిశ్రమలోని మరికొందరు కూడి విరాళం ఇచ్చే అవకాశాలున్నాయి.

 

తుపాను బాధిత సహాయార్దం పారిశ్రామికవేత్తలు, సంస్ధలు కూడా విరాళాలు ప్రకటిస్తున్నారు. వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా పార్టీ తరపున కోటి రాపాయల విరాళాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. సరే అందరూ ప్రకటిస్తున్నారు సరే. ముఖ్యమంత్రి, తెలుగుదేశంపార్టీ జాతీయ అధ్యక్షుని హోదాలో ఉన్న చంద్రబాబు కానీ ఆయన కొడుకు,  పార్టీ ప్రధాన కార్యదర్శి, మంత్రి హోదాలో ఉన్న నారా లోకేష్ మాత్రం ఇంత వరకూ విరాళాల విషయంలో నోరిప్పలేదు. ఒక్క రూపాయి కూడా ఎందుకు విరాళంగా ప్రకటించలేదు ?

 

విమర్శలకు భయపడే ఏమో గురువారం నాడు హెరిటేజ్ తరపున రూ 66 లక్షల విరాళం ప్రకటించినట్లు బ్రాహ్మణి గొప్పగా చెప్పుకున్నారు. తీరా చూస్తే ఆ విరాళం హెరిటేజ్ సంస్ధలో ఉద్యోగుల జీతాల్లో నుండి కోతేసిందట. కోట్ల రూపాయలు జీతాలను అందుకుంటున్న భువనేశ్వరి, బ్రాహ్మణిలకు మాత్రం తమ వ్యక్తిగత ఖాతాల్లో నుండి విరాళం ప్రకటించాలని మనసు రాకపోవటం ఆశ్చర్యంగా ఉంది.