తాను కుమారుడితో కలసి వైసిపిలో చేరినట్లు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అమలాపురం మాజీ ఎంపి జివి హర్షకుమార్ ఖండించారు. తాను ఇపుడు ఏ పార్టీలో లేనని చెప్పారు.
‘నేను ప్రస్తుతం ఏ పార్టీలో లేను. వైసిసి లో చేరానని జరగుతున్న ప్రచారం తప్పు. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ తరఫున ప్రచారం చేయడం లేదు,’ అని ఆయన ‘తెలుగు రాజ్యం’ కు చెప్పారు.
తెలుగుదేశం లో చేరారని, అయితే, ఆ పార్టీ నుంచి మూడు రోజులలో నే బయటకొచ్చానని ఆయన చెప్పారు.
తన భవిష్యత్ కార్యక్రమాన్ని తొందరలోప్రకటిస్తానని ఆయన చెప్పారు. 2019 ఎన్నికలు సుస్థిరప్రభుత్వాన్ని అందివ్వక పోవచ్చని ఆయన వ్యాఖ్యానించారు.
కొత్త పార్టీ పెట్టే ఆలోచన ఉందా అని అడిగిపుడు అవున్నారు. హర్షకుమార్ కొత్త పార్టీ పెడతారని దళిత అజండా తోనే తన పార్టీ వస్తుందని ఆయన చెప్పారు.
2019 ఎన్నికల్లో దళితులు ఇతర పార్టీలతో ఉన్నారని, అయితే, ఎన్నికలయిన అయిదారు నెలల్లో వారు తాము మద్దతిచ్చిన పార్టీలతో అసంతృప్తికి గురవుతారని చెబుతూ ఎన్నికల తర్వాత కొత్త పార్టీ ప్రకటించే ఆలోచన ఉందని అన్నారు.
దీనికోసం రాష్ట్రంలోని ఇతర దళిత నాయకులు అంటే మంద కృష్ణ మాదిగ వంటి వారితో సంప్రదింపులు జరుపుతానని చెప్పారు.వైసిపి,జనసేన పార్టీల నాయకులతో తనకు ఛేదు అనుభవాలున్నాయని అన్నారు. టిడిపి నేతలు కొందరు తనకు అమలాపురం టికెట్ ఇస్తామని హామి ఇచ్చారని, అయితే, బయటి శక్తుల వత్తిడి వల్ల తెలుగుదేశం ఈ హామీ నుంచి వెనక్క తగ్గిందని అన్నారు.
అదే విధంగా కాంగ్రెస్ వారు కూడా తనకు అమలాపురం కాకుండా రాజమండ్రి లోక్ సభ స్థానం ఇస్తామని అన్నారని అంటూ దీని వెనక ఉన్న రాజకీయాలు తనకు తెలసునని ,అందుకే ఇలాంటి రాజకీయ కుట్రలకు వ్యతిరేకంగా నే కొత్త పార్టీ ఏర్పాటుచేయాలనుకుంటున్నట్లు చెప్పారు.