ఇది చదివితే.. హరీష్ రావు కి మొత్తం సెట్ అయిపోతుంది!

అతి సర్వత్ర వర్జయేత్.. అతి అన్నిచోట్లా అనర్ధదాయకమే. ఒక్కోసారి ఓవర్ కాన్ఫిడేన్స్ తో చెప్పే మాటలు, చేసే ప్రకటనలు బౌన్స్ బ్యాక్ అవుతుంటాయి. ఫలితంగా మొదటికే మోసం వచ్చే చర్చలకు దారితీస్తుంటాయి. “ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో” అనే కామెంట్లు పడేలా చేస్తాయి. ఇంతకూ ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకంటే… తెలంగాణ మంతి హరీష్ రావు గురించి.

తెలంగాణ చాలా అద్భుతమైన రాష్ట్రం, తెలంగాణలో చాలా అద్భుతాలు జరిగిపోతున్నాయి, తెలంగాణ మరో కేరళ అన్నంతగా సెల్ఫ్ డబ్బా స్టార్ట్ చేశారు హరీష్ రావు. అలా ఎంత మాట్లాడుకున్నా ఎవరూ పట్టించుకోరు. ఏపీ జనాలకు ఆ కబుర్లు అవసరం లేదు.. తెలంగాణ ప్రజలకు వాస్తవాలు ఎలాగూ తెలుసు. కానీ… వచ్చిన సమస్యెల్లా… ఏపీ గురించి తక్కువచేసి మాట్లాడటం!

అవును… తెలంగాణా మంత్రుల గురించి, తెలంగాణా ప్రభుత్వం గురించి, తెలంగాణలో రోజుకొకటిగా వెలుగుచూస్తున్న అక్రమాల గురించి, హస్తిన స్థాయిలో విచారణలు ఎదుర్కొంటున్న అవినీతి గురించి… ఏపీ మంత్రులు ఎవరూ మాట్లాడరు! కానీ… ఏపీ పేరుచెప్పి తెలంగాణా మంత్రులు మాత్రం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. సిద్ధిపేటలో జరిగిన భవన నిర్మాణ కార్మికులు మీటింగ్ సందర్భంగా మాట్లాడిన హరీష్… ఏపీనుండి పనులకోసం తెలంగాణాకు వచ్చిన కూలీలకు ఏపీలో పరిస్ధితులు, తెలంగాణాలో పరిస్ధితులలో తేడా తెలుసుకోవాలని సూచించారు.

ఏపీ అభివృద్ధికి – తెలంగాణా అభివృద్ధికి.. భూమికి ఆకాశానికి మధ్య ఉన్నంత గ్యాప్ ఉందని పలికారు. అక్కడితో ఆగలేదు సుమా… ఏపీలో పాలన ఎలాగుందో చూడండి.. తెలంగాణా పాలన ఎలాగుందో చూసుకోండంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి ఏపీలో ఓటుహక్కును వదులుకుని, తెలంగాణాలో నమోదు చేసుకోవాలని కోరారు. రోడ్లు, ఆసుపత్రుల విషయంలో ఏపీతో పోల్చుకుని చూడాలని.. అలా చూస్తే తెలంగాణ ముందు ఏపీ ఎందుకు పనికి రాదు అన్నట్లుగా మాట్లాడారు హరీష్!

దీంతో… అంతెత్తున లేచి పడుతున్నారు వైసీపీ నేతలు, కార్యకర్తలు. టీఎస్పీఎస్సీ పేపర్స్ అమ్ముకునే రాష్ట్రంలో, పదోతరగతి ప్రశ్నా పత్రాలు వాట్సప్ లో షేర్ చేసుకునే పాలనకు, లిక్కర్ స్కాం బ్యాచ్ తో కలవడానికి తెలంగాణ వెళ్లాల్సిందే అని.., వారిని ఓడించడం కోసమైనా ఓటు హక్కు అక్కడికి మార్చుకోవాల్సిందే అని సెటైర్స్ వేస్తున్నారు.

ముందు సర్విస్ కమిషన్ పరీక్షలు పక్కాగా కండక్ట్ చేయడం నేర్చుకోండి.. కనీసం పదోతరగతి పరీక్షలైనా ప్రశాంతంగా జరిగేలా చూడండి. ప్రవేటూ వర్శిటీ బిల్లు ఆమోదం కాకముందే ఏర్పాటైన రెండు వర్శిటీలలో అడ్మిషన్స్ తీసుకున్న విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచించడం. వారు ఓట్లు ఏపీకి మార్చుకోకుండా చూసుకోండి. సుఖేస్ విడుదల చేస్తున్న కిలో నెయ్యి ప్యాకెట్ల లెక్కలు తేల్చుకోండి. కాలేశ్వరం ని ఏటీఎం అంటూన్నారు.. అదేందో చూసుకోండి. అంటూ వాయించేస్తున్నారు!

ఇక్కడ గమనించాల్సిందేమిటంటే… హరీష్ దృష్టిలో అభివృద్ధి అంటే కేవలం హైదరాబాద్ అభివృద్ధి అనుకోవడమే! అది కూడా సరైన వర్షాలు పడేవరకే. నాలుగు చినికులు పడితే… ఆ అభివృద్ది అసలు రంగు కూడా బయటపడుతుంది. ఏపీ జనాల ఓట్లు కావాలంటే అడగాల్సిన పద్దతి ఇదికాదు. ఇక తెలంగాణలో వెలుగుచుస్తున్న అవినీతి, అక్రమాలపై మాట్లాడటం కూడా బాగోదు. సో… ఏపీ నాయకులు చూపిస్తున్న హుందాతనం, వారికున్న సంస్కారం… హరీష్ కూడా కలిగి ఉండాలి.. అని ఆన్ లైన్ వేదికగా కోరుకుంటున్నారు ఏపీ జనాలు!

Telangana Minister Harish Rao key Comments On AP | ఏపీ పాలనపై మంత్రి హరీశ్‌ రావు కీలక వ్యాఖ్యలు