గుంటూరు ఫిక్స్… టీడీపీ – జనసేన అభ్యర్థులు వీరే!

ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఒకపైపు పొత్తుల మంతనాలు చేస్తూనే.. మరోవైపు అభ్యర్థుల ఎంపికపైనా చంద్రబాబు దృష్టిపెట్టారని తెలుస్తుంది. ఇందులో భాగంగా తాజాగా ఏపీ రాజకీయాల్లో ఎక్కువ అసెంబ్లీ నియోజకవర్గాలున్న జిల్లాల్లో ఒకటైన గుంటూరు జిల్లాల్లో అభ్యర్థులపై ఒక క్లారిటీకి వచ్చారని తెలుస్తుంది. ఇందులో భాగంగా ఉన్న 17 నియోజకవర్గాల్లోనూ 13 నియోజకవర్గాలకు ఉమ్మడి అభ్యర్థులను ఫైనల్ చేశారని తెలుస్తుంది.

ఇక మిగిలిన నాలుగు నియోజకవర్గాలలోనూ ఒకటి జనసేన, మిగిలిన మూడూ టీడీపీ అభ్యర్థులు పోటీచేసే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ప్రాస్తుతానికి మాత్రం ఈ 13 నియోజకవర్గాల్లోనూ 12 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు సంబంధించిన పేర్లు తెరపైకి వస్తున్నాయి! బీజేపీతో పొత్తు అనంతరం వీటిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. గరిష్టంగా ఈ జిల్లాలో ఈ 13 నియోజకవర్గాల వరకూ మార్పులు ఉండకపోవచ్చని సమాచారం.

ఇందులో భాగంగా… ముందు నుంచి ఊహించినట్టుగానే తెనాలి అసెంబ్లీ టిక్కెట్ ను జనసేన పార్టీకి కేటాయించారు చంద్రబాబు. ఇందులో భాగంగా… ఇక్కడి నుంచి జనసేన పార్టీ ముఖ్య నేత నాదెండ్ల మనోహర్‌ పోటీ చేయనున్నారు. దీంతో ఈ సీటు ఆశిస్తున్న టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ కు నిరాశ తప్పకపోవడం ఆల్ మోస్ట్ కన్ ఫాం అయ్యిందని తెలుస్తుంది. ఇక ఈ జిల్లాతో పాటు రాష్ట్రంలోనే కీలక నియోజకవర్గాల్లో ఒకటైన మంగళగిరి నుంచి నారా లోకేష్ పోటీ చేస్తున్నారు.

ఇదే సమయంలో సత్తెనపల్లి – మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, రేపల్లె – సిట్టింగ్‌ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్‌ పోటీ చేయడం ఖాయమంటున్నారు. అయితే.. సత్తెనపల్లి సీటు ఆశించిన కోడెల్ శివప్రసాద్ కుమారుడితో కాస్త ఇంటర్నల్ వార్ ఉండే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అయినప్పటికీ బీజేపీ నుంచి వచ్చిన కన్నాకే సత్తెనపల్లి టిక్కెట్ కన్ ఫాం చేశారు చంద్రబాబు.

వేమూరు – మాజీ మంత్రి నక్కా ఆనంద్‌ బాబు, తాడికొండ – మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్‌ కుమార్, పొన్నూరు – మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, చిలకలూరిపేట – మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ప్రత్తిపాడు – మాజీ ఐపీఎస్‌ బూర్ల రామాంజనేయులు, వినుకొండ – మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు, మాచర్ల – జూలకంటి బ్రహ్మారెడ్డి, గురజాల – మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, బాపట్ల – వేగేశ్న నరేంద్ర వర్మ బరిలోకి దిగుతారని సమాచారం.

ఇక మిగిలిన నాలుగు నియోజకవర్గాలైన గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమ, పెదకూరపాడు, నరసరావుపేటలపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఇదే సమయంలో గుంటూరు పశ్చిమ సీటును కూడా జనసేన పార్టీకి కేటాయించవచ్చని తెలుస్తుంది. ఇదే సమయంలో… నరసరావుపేట నుంచి వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఈసారి టీడీపీ నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తుంది.