మాధవ్ అభ్యర్ధిత్వంపై కుట్ర..ఏం చేస్తున్నారో తెలుసా ?

హిందుపురం లోక్ సభ నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ తరపున పోటీ చేయబోతున్న గోరంట్ల మాధవ్ పై ప్రభుత్వం కక్షసాధింపులకు దిగిందిట. హిందుపురం ఎంపిగా పోటీ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి హామీ రాగానే మాధవ్ పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేసేశారు. హామీని ఇచ్చినట్లుగానే మాధవ్ కు జగన్ టికెట్ ఇచ్చారు. అయితే, అభ్యర్ధికి ఇక్కడే సమస్య మొదలైంది.

ఎన్నికల్లో పోటీ చేయటానికి వీలుగా మాధవ్ రెండు నెలల క్రితమే రాజీనామా చేశారు. అయితే, రాజీనామా ఇప్పటి వరకూ ఆమోదంపొందలేదు. మామూలుగా అయితే రాజీనామాను ఆమోదించటానికి ఇంతకాలం అవసరం లేదు. రాజీనామా చేసిన ఉద్యోగితో ఉన్నతాధికారులు ఒకసారి మాట్లాడి సానుకూలంగా స్పందిస్తారు. కానీ మాధవ్ విషయంలో మాత్రం ఉన్నతాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. కారణం ఏమిటంటే వైసిపి తరపున ఎంపిగా పోటీ చేయటమే.

హిందుపురం లోక్ సభ నియోజకవర్గం పరిధిలో బిసి సామాజికవర్గం ఓటర్లు ఎక్కువ. అందులోను కురబ ఉపకులం ఓట్లు ఇంకా ఎక్కువ. మాధవ్ కురబ ఉపకులానికి చెందిన వ్యక్తి అవటంతో పాటు పోలీసు అధికారిగా మంచి పేరుంది. దాంతో వైసిపి తరపున మాధవ్ గట్టి అభ్యర్ధిగా ప్రచారంలో ఉన్నారు. కచ్చితంగా మాధవే గెలిచే అభ్యర్ధి అనికూడా చెప్పుకుంటున్నారు. దాంతో అధికారపార్టీలో ఆందోళన మొదలైంది.

వీలుంటే మాధవ్ ను నామినేషన్ వేయనీయకుండా అడ్డుకోవాలని కుదరకపోతే నామినేషన్ల దాఖలు గడువు ముగిసేవరకూ రాజీనామాను ఆమోదించకుండా ఇబ్బంది పెట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యంగా తెలుస్తోంది. రాజీనామా ఆమోదించకపోయినా కోర్టు ద్వారా ఆదేశాలిప్పించుకుని నామినేషన్ వేయొచ్చని నిబంధనల్లోనే ఉందట. మరి మాధవ్ ఏం చేస్తారో చూడాలి.