హిందుపురం లోక్ సభ వైసిపి అభ్యర్ధి గోరంట్ల మాధవ్ ను పోటీ చేయనీయకుండా చంద్రబాబునాయుడు చేసిన కుట్రే గెలిచేట్లు కనిపిస్తోంది. మాధవ్ వైసిపి తరపున పోటీ చేస్తే టిడిపి అభ్యర్ధి నిమ్మల కిష్టప్ప గెలుపు కష్టమని చంద్రబాబుకు అర్ధమైపోయింది. అందుకనే మాధవ్ రెండు నెలల క్రితమే పోలీసు ఉద్యోగానికి చేసిన రాజీనామాను ప్రభుత్వం ఆమోదించకుండా తొక్కిపెట్టింది. ఎప్పుడైతే రాజీనామా ఆమోదం పొందలేదో మాధవ్ పోటీకి అనర్హుడవుతారు.
ఈ విషయాన్ని ముందుగా ఊహించే మాధవ్ కోర్టులో కేసు కూడా వేశారు. ఆ కేసుపైనే కోర్టులో విచారణ జరుగుతోంది. ఎందుకైనా మంచిదని వైసిపి జిల్లా మాజీ జడ్జి కురబ కిష్టప్ప అభ్యర్ధిత్వంతో పాటు మాధవ్ భార్య పేరును కూడా పరిశీలిస్తోంది. మాధవ్ ను పోటీ చేయనీయకూడదన్న టిడిపి ప్లానే వర్కవుటవుతుందా లేకపోతే మాధవ్ పోటికి కోర్టు అనుమతి ఇస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది.
ఏదేమైనా వైసిపి అభ్యర్ధిని పోటీ నుండి తప్పించే ప్రయత్నాలను టిడిపి ముమ్మరం చేసింది. నేరుగా పోటీ చేస్తే వైసిపి అభ్యర్ధిని ఓడించటం సాధ్యం కాదని అర్ధమైన టిడిపి అలవాటైన దొడ్డిదోవను ఎంచుకుంది. హిందుపురంలో చాలా కాలంగా టిడిపినే గెలుస్తోంది. మొదటిసారి వైసిపి గెలుస్తుందనే వాతావరణం కనిపిస్తోంది. అందుకనే కుట్రలు మొదలుపెట్టింది. నియోజకవర్గం వ్యాప్తంగా బిసిల్లో మాధవ్ ఉపకులమైన కురబలు చాలా ఎక్కువగా ఉన్నారట. అందుకనే మాధవ్ గెలుపుపై వైసిపి కూడా ధీమాగా ఉంది. అంటే మాధవ్ పోటీ విషయం కోర్టు చేతిలో ఉందన్నమాట.