నార్ల , గోరా శాస్త్రి , నీలంరాజు గొప్ప జర్నలిస్టులు
సమాజంలో పాత్రికేయ వృత్తి ఎంతో గౌరవ ప్రదమైనదని , వారు ఎందరికో స్ఫూర్తిని కలిగిస్తారని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు చెప్పారు . ఒకప్పటి సంపాదకుడు గోరా శాస్త్రి శత జయంతి వేడుకల్ల్లో వెంకయ్య నాయుడు ముఖ్య అతిగిగా పాల్గొన్నారు . హైద్రాబాద్ లోని డాక్టర్ ఎమ్ . చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లో ఈ రోజు వయోధిక పాత్రికేయ సంఘం , కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి .
ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ..గోరా శాస్త్రి సంపాదకీయాలు చాలా నిర్మొహమాటంగా ఉండేవి . రాజకీయ వ్యవస్థల మీదా , నాయకుల మీద కూడా ఆయన విమర్శనాత్మక సంపాదకీయాలు రాసేవారు . అప్పటి తరంలో నార్ల వెంకటేశ్వర రావు, నీలంరాజు వెంకట శేషయ్య , గోరా శాస్త్రి లాంటి వారి జీవిత చరిత్రలను పాఠ్యఅంశాలుగా రావలసిన అవసరం ఉందని తెలిపారు . ఇప్పుడు వున్నా జర్నలిస్టుల గురించి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ .. సత్యానికి దగ్గరగా , సంచలనానికి దూరంగా వార్తలు రాయండని చెప్పారు . ఈ సందర్భంగా గోరా శాస్త్రి రచించిన వినాయకుడు వీణ అనే గ్రంధాన్ని ఆవిష్కరించారు .
కేంద్ర సాహిత్య అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు , వయోధిక సంఘం అధ్యక్షుడు జి .ఎస్ .వరదాచారి, ఉదయవర్లు , లక్ష్మణ రావు తదితరులు పాల్గొన్నారు .