వైసీపీలోకి గంటా… వెళ్తే జరిగే మార్పులివే!!

గంటా శ్రీనివాస్ కెరీర్ లో ఊహించని పరిణామం జరిగిందని అంటున్నారు! చంద్రబాబు వద్ద ఆయనకు టిక్కెట్ విషయంలో అవమానం జరిగిందనేది చర్చ! ఆయనకు భీమిలీ కావాలి.. బాబుకు ఆయనను చీపురుపల్లి పంపించి బొత్సాపై పోటీకి నిలబెట్టాలన్నది కోరిక! తనను విశాఖ నుంచి పంపించేయాలని, పొమ్మన లేక పొగబెడుతున్నారనేది గంటాకున్న క్లారిటీ! కట్ చేస్తే… ఇప్పుడు గంటా ముందున్న ఆప్షన్ ఏమిటి? అనేది విశాఖలో వినిపిస్తున్న బిగ్ క్వశ్చన్!

ఇప్పుడు గంటా ముందు చాలా ఆప్షన్సే ఉన్నట్లు కనిపించినా… అవి ప్రాక్టికల్ గా సాధ్యం కాదని అంటున్నారు పరిశీలకులు. టీడీపీతో గంటాకు ఆల్ మోస్ట్ చెడిందని.. ఇక, అధికారిక ప్రకటనే తరువాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీని కాదని జనసేనలో చేరే అవకాశం, బీజేపీలో కలిసే ఛాన్స్ గంటాకు ఉన్నాయి. అయితే… ప్రస్తుతం టీడీపీతో బీజేపీ – జనసేనలు కలిసి ప్రయాణించబోతున్నాయన్న నేపథ్యంలో బాబుని కాదని గంటా సాధించేదేమీ లేదు!

అలా అని కాంగ్రెస్ లో చేరి.. కెరీర్ మళ్లీ ఫస్ట్ నుంచి ప్రారంభించనూ లేరు! ఇక మిగిలింది ఒకే ఒక్క ఆప్షన్.. అదే వైసీపీలో జాయిన్ అవ్వడం! వాస్తవానికి గతంలోనే గంటా.. వైసీపీలోకి రావాలని భావించారు. అయితే… నాడు అప్పటి మంత్రి అవంతి శ్రీనివాసరావు అడ్డు పడ్డారని చెబుతారు. మరి ఇపుడు గంటా వస్తాను అంటే వైసీపీ ఓకే అంటుందా?… రాజకీయాలలో ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు!!

దీంతో గంటా వైసీపీలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని.. వస్తే భీమిలీ టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు పరిశీలకులు. కారణం… గంటా భీమిలీలో చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. పైగా గతంలో 40వేల పైచిలుకు ఓట్ల తేడాతో గెలవడంతోపాటు.. అనుచర గణం కూడా బాగానే ఉంది. ఆర్థికంగా కూడా బలమైన నేతే! దీంతో… గంటా కు భీమిలి టిక్కెట్ ఇచ్చే అవకాశాన్ని వైసీపీ పరిశీలించొచ్చు! కారణం… ఇప్పుడు అక్కడ అవంతి కాస్త బలహీనపడ్డారనే చర్చ నడుస్తుండటమే!

అందువల్ల భీమిలి ఎమ్మెల్యే టిక్కెట్ గంటాకు ఇచ్చి.. అవంతి శ్రీనివాస్ ను అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దింపగలిగితే సమస్య పరిష్కారం అయినట్లే! అప్పుడు అనకాపల్లి ఎంపీ స్థానానికి నాగబాబు వర్సెస్ అవంతి శ్రీనివాస్ మధ్య కాపు వర్సెస్ కాపు ఫైట్ జరుగుతుంది! అంటే… ఇప్పుడు గంటా శ్రీనివాస రావు వైసీపీలోకి వస్తే వచ్చే సమస్యలేమీ లేవన్నమాట. చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకుంటే… విశాఖలో వైసీపీ మరింత బలపడే అవకాశం ఉందనే భావించాలన్నమాట!!

మరి ఈ విషయాలపై వైసీపీ అధిష్టాణం ఎలా రియాక్ట్ అవ్వబోతుందనేది వేచి చూడాలి. వైసీపీ కూడా గంటాకు నో చెబితే.. అప్పుడు ఆయన నెక్స్ట్ స్టేప్ ఏమిటనేది వేచి చూడాలి!