కౌంటర్స్ – ఎన్ కౌంటర్స్: హాట్ టాపిక్ గా “జె గన్”!

ఏపీలో రాజకీయం హాట్ హాట్‌ గా సాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాదిలో ఎన్నికలున్న తెలంగాణలో కంటే.. ఇంకా ఏడాది సమయమున్న ఏపీలోనే రాజకీయాలు మరింత వేడెక్కుతున్నాయన్నా అతిశ్యోక్తి కాదన్నట్లుగా రాజకీయాలు మారిపోతున్నాయి. ఈ క్రమంలో… తాజాగా తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన అలంకరణ వివాదంగా మారింది. దీంతో… కౌంటర్స్, ఎన్ కౌంటర్స్ తో బిజీగా ఉన్నారు నెటిజన్లు.

తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన పూల అలంకారణ పొలిటికల్ గా హాట్ టాపిక్ గా మారింది. జాతర సందర్భంగా ఆలయ ప్రధాన ద్వారం వద్ద ప్రత్యేకంగా పూలతో ఆకర్షనీయంగా తోరణాన్ని ఏర్పాటు చేశారు. అయితే ముఖద్వారం వైపు వివిధ రంగులు పోలిన పూలమధ్యలో జె (J) అనే ఇంగ్లీస్ అక్షరం, గన్‌ (తుపాకీ) బొమ్మలా డిజైన్ ఏర్పాటు చేశారు. ఇది కాస్తా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది. ఇదేంటంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. తాజాగా ఈ విషయంపై చంద్రబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు.

“తిరుపతి గంగమ్మ గుడికి ఇలాంటి అలంకారమా? దేవుని సన్నిధిలో ఈ ‘గన్’ సంస్కృతి ఏంటి? వైసీపీ జెండా గుర్తులు ఏంటి? పిచ్చి పట్టిందా? ‘J’ అక్షరానికి గంగమ్మకి సంబంధం ఉందా? మీ ప్రచార పిచ్చితో, అహంకారంతో దేవుళ్ళ దగ్గర ఇలాంటి వేషాలా?” అంటూ ట్వీట్ చేశారు. దీంతో… గతంలో చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు ఐటీడీపీ టీం రిలీజ్ చేసిన ఫోటోలను వైరల్ చేస్తున్నారు వైకాపా నెటిజన్లు. దీంతో… ఆన్ లైన్ వేదికగా ఈ పొలిటికల్ గాడ్స్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.