బిగ్ న్యూస్… టీడీపీ – జనసేన అభ్యర్థుల తొలి జాబితా ఇదే!

ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ, జనసేన కార్యకర్తలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న విషయంపై సగం క్లారిటీ వచ్చింది. ఇందులో భాగంగా టీడీపీ – జనసేన నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యింది. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఒకే వేదికపై నుంచి అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మొత్తం 175 స్థానాలకు గానూ తొలివిడతలో భాగంగా 118 పేర్లతో జాబితాను విడుదల చేశారు.

ఈ సందర్భంగా వేదికపై ఇరు పార్టీల నుంచి ముగ్గురేసి సభ్యుల చొప్పున ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇందులో భాగంగా టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడు, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు హాజరుకాగా… వైసీపీ నుంచి పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్, కొణిదెల నాగబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పందించిన పవన్, బాబు… రాష్ట్ర ప్రయోజనాలకోసం టీడీపీ – జనసేన కలయిక జరిగిందని తెలిపారు. బీజేపీ కూడా కలిసి వస్తే తగిన సమయంలో తగిన నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు.

ఈ సందర్భంగా స్పందించిన పవన్ కల్యాణ్… జనసేన 24 అసెంబ్లీ, 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. భారతీయ జనతాపార్టీని దృష్టిలో పెట్టుకుని కూడా జనసేన పరిమితమైన స్థానాల్లో పోటీచేయాలని నిర్ణయించుకుందని అన్నారు. చాలా మంది 60 లేదా 70 సీట్లలో పోటీ చేయాలని అన్నారని ఈ సందర్భంగా వెల్లడించిన పవన్… గతంలో 10 సీట్లు గెలిచి ఉండుంటే అడగటానికి ఉండేదని అన్నారు.

జనసేన అభ్యర్థుల తొలి జాబితా:

నెల్లిమర్ల – లోకం మాధవి

అనకాపల్లి – కొణతాల రామకృష్ణ

రాజానగరం – బత్తుల బలరామ కృష్ణ

కాకినాడ రూరల్ – పంతం నానాజీ

తెనాలి – నాదెండ్ల మనోహర్

టీడీపీ అభ్యర్థుల తొలివిడత జాబితా:

ఇచ్చాపురం – అశోక్

టెక్కలి – అచ్చెన్నాయుడు

ఆమదాలవలస – కోన రవికుమర్

రాజాం – కొండ్రు మురళి

కురుపాం – జగదీశ్వరి

పార్వతీపురం – విజయ్

సాలూరు – గుమ్మడి సంధ్యారాణి

బొబ్బిలి – రంగారావు

గజపతినగరం – కోనపల్లి శ్రీనివాస్

విజయనగరం – అశోక్ గజపతి రాజు

విశాఖ ఈస్ట్ – రామకృష్ణబాబు

విశాఖ వెస్ట్ – పీజీవీఆర్ నాయుడు (గణబాబు)

అరకు – సివేరి దొన్నురొర

పాయకరావుపేట – వంగలపూడి అనిత

నర్సీపట్నం – అయ్యన్నపాత్రుడు

తుని – యనమల దివ్య

పెద్దాపురం – నిమ్మకాయల చినరాజప్ప

అనపర్తి – నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి

ముమ్మిడివరం – సుబ్బరాజు

గన్నవరం – రాజేష్ కుమార్

కొత్తపేట – బండారు సత్యానంద రావు

మండపేట – జోగేశ్వర రావు

రాజమండ్రి సిటీ – ఆదిరెడ్డి వాసు

జగ్గంపేట – జ్యోతుల వెంకట అప్పారావు

ఆచంట – పితాని సత్యన్నారయణ

పాలకొల్లు – నిమ్మల రామనాయుడు

ఉండి – మంతెన రామరాజు

తణుకు – అరిమిల్లి రాధాకృష్ణ

ఏలూరు – బాడేటి రాధాకృష్ణ

చింతలపూడి – సొంగా రోషన్‌ కుమార్‌

తిరువూరు – కొలికపూడి శ్రీనివాస్

నూజివీడు – కొలుసు పార్థసారధి

గన్నవరం – యార్లగడ్డ వెంకట్రావు

గుడివాడ – వెనిగండ్ల రాము

పెడన – కాగితం వెంకట కృష్ణప్రసాద్

మచిలీపట్నం – కొల్లు రవీంద్ర

పామర్రు – వర్ల కుమార్ రాజా

విజయవాడ సెంట్రల్ – బోండా ఉమ

విజయవాడ ఈస్ట్ – గద్దే రాంమోహన్ రావు

నందిగామ – తంగిరాల సౌమ్య

జగ్గయ్యపేట – శ్రీరాం రాజగోపాల్ తాతయ్య

తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్

మంగళగిరి – నారా లోకేష్

పొన్నూరు – దూళిపాళ్ల నరేంద్ర

వేమూరు – నక్కా ఆనందబాబు

రేపల్లె – అనగాని సత్యప్రసాద్

బాపట్ల – వేగేశ్న నరేంద్ర వర్మ

ప్రత్తిపాడు – బుర్ల రామాంజనేయులు

చిలకలూరిపేట – ప్రత్తిపాటి పుల్లారావు

సత్తెనపల్లి – కన్నా లక్ష్మీనారాయణ

వినుకొండ – జీవీ ఆంజనేయులు

మాచర్ల – జూలకంటి బ్రహ్మానంద రెడ్డి

ఎర్రగొండెపాలెం – గూడురి ఎరిక్షన్ బాబు

పర్చూరు – ఏలూరి సాంబశివరావు

అద్దంకి – గొట్టిపాటి రవి

సంతనూతలపాడు – బీఎన్ విజయ్ కుమార్

ఒంగోలు – దామచర్ల జనార్ధన్ రావు

కొండేపి – బాల వీరాంజనేయ స్వామి

కనిగిరి – ఉగ్ర నరసింహా రెడ్డి

కావలి – కావ్య కృష్ణారెడ్డి

నెల్లూరు సిటీ – పొంగూరు నారాయణ

నెల్లూరు రూరల్ – కోటమ్రెడ్డి శ్రీధర్ రెడ్డి

గూడూరు – సునీల్ కుమార్

సూళ్లూరు పేట – విజయశ్రీ

ఉదయగిరి – కాకర్ల సురేష్

కడప – మాధవి రెడ్డి

రాయచోటి – రాంప్రసాద్ రెడ్డి

పులివెందుల – రవీంద్రనాథ్ రెడ్డి

మైదుకూరు – పుట్టా సుధాకర్ యాదవ్

ఆల్లగడ్డ – భూమా అఖిలప్రియా రెడ్డి

శ్రీశైలం – రాజశేఖర్ రెడ్డి

కర్నూలు – టీజీ భరత్

పాణ్యం – గౌరు చరితారెడ్డి

నంద్యాల – ఫరూఖ్

బనగానపల్లి – జనార్ధన్ రెడ్డి

డోన్ – కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి

పత్తికొండ – శ్యాంబాబు

కోడుమూరు – బొగ్గుల దస్తగిరి

రాయదుర్గ్ – కాల్వ శ్రీనివాసులు

ఉరవకొండ – పయ్యావుల కేశవ్

తాడిపత్రి – జేసీ అశ్మిత్ రెడ్డి

సింగనమల – బండారు శ్రావణి శ్రీ

కళ్యాణదుర్గం – సురేంద్రబాబు

రాప్తాడు – పరిటాల సునీత

మడకశిర – సునీల్ కుమార్

హిందూపుర్ – నందమూరి బాలకృష్ణ

పెనుగొండ – సవిత

తంబాలపల్లె – జయచంద్రా రెడ్డి

పీలేరు – నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి

నగరి – గాలి భాను ప్రకాశ్

గంగాధర్ నెల్లూరు – వీఎం థామస్

చిత్తురు – గురజాల జగన్ మోహన్

పలమనేరు – ఎన్. అమర్నాథ్ రెడ్డి

కుప్పం – చంద్రబాబు నాయుడు