నందమూరి తారక రామారావు టీడీపీ పార్టీని స్థాపించి, కేవలం 9నెలల్లోనే అధికారంలో వచ్చి దేశంలోనే నూతన రాజకీయాలకు తెర తీశారు. మద్రాసియులుగా ఉన్న తెలుగు వారికి, తెలుగు జాతి అనే గుర్తింపును తెచ్చిన వారిలో ఎన్టీఆర్ ప్రముఖుడు. ఆయన పాలనా విధానం వల్ల దేశంలో పెద్ద నాయకులు సైతం ఆశ్చర్యపోయారు. ఆయన ప్రధాని కూడా అయ్యే అవకాశం ఉందని అప్పట్లో వార్తలు వినిపించాయి. టీడీపీ పార్టీ యొక్క దేశ వ్యాప్తంగా వినిపించేలా ఎన్టీఆర్ వ్యవహరించారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు దేశం పార్టీ దీన స్థితికి చేరుకుంది.
విభజన తరువాత తెలంగాణలో, 2019 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ లో పతనానికి చేరువైంది. ఈ తరుణంలో పార్టీ కాపాడటానికి ఒక నూతన నాయకుడి అవసరం ఎంతైనా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్ పోటీ పడనున్నారా!
అన్న ఎన్టీఆర్ గారికి పదకొండు మంది సంతానంగా ఉండేవారు. వారి పిల్లలు అంటే మనవలు దాదాపుగా మూడు డజన్ల దాకా ఉంటారని ఒక అంచనా. మనవల్లలో జూనియర్ ఎన్టీఆర్ పేరు, నారా లోకేష్ పేరు ఎక్కువగా వినిపిస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ప్రతిభ గురించి రెండు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. జూనియర్ ఎన్టీఆర్ మూవీస్ లో సీనియర్ ఎన్టీఆర్ కు నిజమైన వారసుడని నిరూపించుకున్నారు. అలాగే 2009 ఎన్నికల వేళ చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను ప్రచార సేవలను వాడుకున్నారు. ఆ ఎన్నికల్లో టీడీపీని జూనియర్ గెలిపించకపోయినా ఆయన జనంలో మాత్రం ఎన్టీయార్ కి అసలైన వారసుడు అని గట్టి ముద్రను వేసుకున్నారు. అచ్చం పెద్దాయనలాగానే ఉన్నాడే అని సగటు తెలుగు జనం అనుకున్నారు. దాంతో ఇవాళ కాకపోయినా రేపు అయినా టీడీపీకి భావి సారధి అవుతాడని రాజకీయ వర్గాలు చర్చించుకున్నాయి. అయితే మరోవైపు నారా లోకేష్ కూడా పార్టీ పగ్గాలు చేపట్టి రానున్న రోజుల్లో సీఎం కుర్చీపై కూర్చోవడానికి ఇష్టపడుతున్నారు.
అయితే ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తరువాత లోకేష్ ప్రతిభను చూసిన వారు ఆయన పార్టీని కాదు కదా ఒక సర్పంచ్ గా పనికిరాడని రాజకీయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.
చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ పై కుట్ర పన్నాడా!
2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన ఎన్టీఆర్ ప్రజల్లో మంచి ఆదరణను పొందారు. అలాగే 2009లో జరిగిన మహానాడులో ఎన్టీఆర్ ఇచ్చిన ప్రసంగానికి పార్టీ శ్రేణులు కూడా ముగ్దులు అయ్యారు. చంద్రబాబు నాయుడు ప్రసంగాని కంటే ఎన్టీఆర్ ప్రసంగానికి ఎక్కువ స్పందన వచ్చింది. ప్రజల్లో ఎన్టీఆర్ పెరుగుతున్న క్రేజ్ ను చూసిన చంద్రబాబు నాయుడు క్రమక్రమంగా జూనియర్ ఎన్టీఆర్ ను పార్టీకి దూరం పెట్టారు. ఎన్టీఆర్ వస్తే తన కొడుకు లోకేష్ కు ఇబ్బందులు వస్తాయని భావించిన చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ను కావాలనే పార్టీకి దూరం పెడుతున్నాడని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. 2014 ఎన్నికల్లో మరో హీరో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ యొక్క సహాయం తీసుకున్నాడు కానీ ఎన్టీఆర్ ను మాత్రం ప్రచారం కోసం వాడుకోలేదు. ఇలా బాబు కుట్రపూరితంగానే ఎన్టీఆర్ ను పార్టీకి దూరం పెడుతున్నాడని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. భవిష్యత్ లో తెలుగు దేశం పార్టీన్ ఎన్టీఆర్ నడిపిస్తాడా లేక నారా లోకేష్ నడిపిస్తాడా వేచి చూడాలి.