ఏపిలో కూడా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయా ? అవుననే సమాధానం చెబుతోంది ఎన్నికల కమీషన్. మీడియాతో ఈరోజు ఎన్నికల కమీషనర్ సిసోడియా మాట్లాడుతూ, ఏపిలో కూడా ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశాలున్నట్లు పరోక్షంగా చెప్పారు. ఎందుకంటే, ఫిబ్రవరి 3వ వారంలోనే ఏపిలో ఎన్నకల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలున్నట్లు చెప్పారు.
షెడ్యూల్ ఎన్నికలు మే నెలలో జరగాలి. అలాంటిది రెండు నెలల ముందే షెడ్యూల్ విడుదలవ్వచ్చని ఎన్నికల ప్రధానాధికారే చెప్పారంటే ఊరికే చెప్పరు కదా ? తెలంగాణాలో ముందస్తు ఎన్నికల ఊహాగానాలు మొదలైనప్పటి నుండి ఏపిలో కూడా ముందస్తు ఎన్నికలపై చాలా వార్తలే వచ్చాయి.
సరే, తెలంగాణాలో అసెంబ్లీ రద్దు కావటం, ఎన్నికల షెడ్యూల్ విడుదలవ్వటం ఇఫుడు నామానేషన్ల ప్రక్రియ కూడా మొదలైపోయింది. ఇటువంటి నేపధ్యంలోనే సోసిడియా మాట్లాడుతూ ఏపిలో ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 3వ వారంలో విడుదలవుతుందని చెప్పారంటే అర్ధమేంటి ? పైగా ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమీషన్ సిద్ధమవుతున్నట్లు కూడా చెప్పారు.
రాష్ట్రంలో కొత్తగా 30 లక్షల మంది తమ ఓటు హక్కును నమోదు చేసుకున్నట్లు చెప్పారు. దశలవారీగా వివి ప్యాట్లను తీసుకొస్తున్నట్లు కూడా తెలిపారు. ఈవిఎంల ప్రత్యేక రక్షణకు ఏర్పాట్లు చేసేందుకు భెల్ కంపెనీకి సిబ్బందిని పంపుతున్నట్లు చెప్పటం చూస్తుంటే అనుమానంగానే ఉంది. ఏపిలో ప్రస్తుతం 3.75 కోట్లమంది ఓటర్లున్నట్లు చెప్పారు. అయితే, సుమారు 52 లక్షల దొంగ ఓట్లున్న విషయంపై మాత్రం సిసోడియా ఏమీ మాట్లాడలేదు.