తెలంగాణ జనసమితికి ఎన్నికల గుర్తును కేటాయించిన ఈసీ

లోక్ సభతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసీ పలు పార్టీలకు గుర్తును కేటాయించింది. దాదాపు 76 పార్టీలకు ఈసీ గుర్తు కేటాయించింది. తెలంగాణ జనసమితికి బాక్సు గుర్తును కేటాయించారు. అలాగే అన్న వైఎస్సార్ పార్టీకి తెలంగాణలో బ్యాట్స్ మెన్ గుర్తును, ఏపీలో ఫుట్ బాల్ గుర్తును కేటాయించింది.

మరోవైపు భారతీయ రాష్ట్రీయ మోర్చాకు తెలంగాణలోని 16 స్థానాలకు బెంచ్‌ గుర్తు ఇచ్చింది. అలాగే మార్క్సిస్ట్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియాకు తెలంగాణలోని 4 లోక్‌సభ స్థానాలకు కంప్యూటర్‌ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది.