ఈ మధ్యకాలంలో పోలీసులపై అవాకులూ చెవాకులూ పేలే రాజకీయ నాయకులు ఎక్కువైపోతున్నారు. సమాజానికి భద్రత కలిపించే పోలీసులంటే కొంతమంది నాయకులకు అలుసైపోతున్నారు. దీంతో.. వారిని ఎదురించి మాట్లాడితేనో, సెక్యూరిటీ మధ్య దాక్కుని వారికి ఛాలెంజ్ లు చేస్తేనో హీరో అని ఫీలవుతున్నారు. ఈ సమయంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యేకి ఒక డీఎస్పీ షాకిచ్చారు.
అవును.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, వివాదాస్పద నేత అయిన చింతమనేని ప్రభాకర్ కి షాకిచ్చారు నూజివీడు డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ గౌడ్! తన రాకను అడ్డుకుంటున్న ఆయనపై వాదనకు దిగిన చింతమనేనికి… రౌడీ షీటర్స్ కి ప్రవేశం లేదని మొఖం మీద చెప్పేశారు. దీంతో చింతమనేని పీచే ముడ్ అని అన్నారు!
వివరాళ్లోకి వెళ్తే… దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు నూజివీడు డిప్యూటీ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ గౌడ్ స్మూత్ వార్నింగ్ విత్ బిగ్ బీజీఎం ఇచ్చారు. వీరమ్మకుంట పంచాయతీ ఉప ఎన్నిక సందర్భంగా.. పోలింగ్ కేంద్రానికి వెళ్లేందుకు చింతమనేని ప్రయత్నించారు.
ఈ సమయంలో రౌడీషీటర్ ను పోలింగ్ కేంద్రానికి రానివ్వమంటూ డీఎస్పీ ఖరాఖండీగా చెప్పేశారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. నేను రౌడీషీటర్ ను అయితే.. ఎందుకు ముందే బైండోవర్ చేయలేదని చింతమనేని ప్రశ్నించారు. దీంతో వాదనకు దిగుతారా.. వెనక్కి వెళ్తారా అని డీఎస్పీ సూటిగా ప్రశ్నించారు. దీంతో చింతమనేనిని ప్రభాకర్ అక్కడనుంచి వెనక్కి వెళ్లారు.
కాగా… గత ఏడాది నవంబర్ లో నూజివీడు డిప్యూటీ సూపరింటెండెంట్ గా అశోక్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు ఆయన రాజమహేంద్రవరం ఇంటెలిజెన్స్ డీఎస్పీగా పనిచేశారు. ఇటీవల ఇదే డీఎస్పీకి టీడీపీ అధినేత చంద్రబాబు బహిరంగంగా వార్నింగ్ ఇవ్వడం కూడా వైరల్ అయ్యింది. దీంతో… ఎవరు ఎన్ని కూతలు కూసినా డ్యూటీ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా అశోక్ వ్యవహారం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!