నందమూరి తారక రామారావు తెలుగు రాజకీయాలను శాసించాడు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్త్తో లేదు .తెలుగువారి కోసం , తెలుగు జాతి అభ్యున్నతి కోసం తన సినిమా జీవితాన్ని త్యాగం చేశాడు . బడుగు , బలహీన వర్గాల సముద్ధరణే ధ్యేయంగా పనిచేసిన గొప్ప నాయకుడు రామారావు . భార్య చనిపోయిన తరువాత 1993లో లక్ష్మి పార్వతిని వివాహం చేసుకోడం కుటుంబంలో ఎవరికీ ఇష్టంలేదు. అప్పటివరకు ఎన్టీఅర్ అంటే ఎదురుగా మాట్లాడలేని కుటుంబ సభ్యులు రామారావు చర్యను విమర్శించం మొదలు పెట్టారు . లక్ష్మి పార్వతికి ఎక్కడలేని ప్రాధాన్యత నిస్తున్నాడని , ఇలా అయితే తన వారసురాలిగా లక్ష్మి పార్వతిని ప్రకటించే అవకాశం ఉందనే ప్రచారం చేయసాగారు . లక్ష్మి పార్వతి కి పూర్తిగా లొంగిపోయాడని కుటుంబ సభ్యులు నమ్మారు . అందుకే అందరు కలసి రామారావు ను ముఖ్య మంత్రి పదవి నుంచి ,పార్టీ అధ్యక్ష పదవి నుంచి దించేయాలని నిర్ణయించుకున్నారు . దీనికి నాయకత్వం వహించింది చంద్ర బాబు , వెనుక నిలబడింది దగ్గుబాటి వెంకటేశ్వర రావు, హరికృష్ణ, బాలకృష్ణ , పురందేశ్వరి తదితరులు . 1995 ఆగస్టులో ప్లాన్ అమలు పరచడం మొదలు పెట్టారు . శాసన సభ్యులు, పార్లమెంట్ సభ్యులను సమావేశ పరచి లక్ష్మి పార్వతి చేతిలోని పార్టీ , ప్రభుత్వం వెళ్ళిపోతుందని భయ పెట్టారు . కుటుంబ సభ్యుల మాటలను అందరు నమ్మారు . ప్రభుత్వం , పార్టీ తమ చేతుల్లోకి వచ్చే వరకు అందరిని హైదరాబాద్ వైస్ రాయ్ హోటల్లో దాచి పెట్టారు . దీని ప్రకారం ముఖ్య మంత్రిగా చంద్ర బాబు, వు ముఖ్య మంత్రిగా దగ్గుబాటి వెంకటేశ్వర రావు, పార్టీ అధ్యక్షుడుగా నందమూరి హరికృష్ణ. ప్లాన్ పక్కాగా అమలు పరిచారు సెప్టెంబర్ 1న నారా చంద్ర బాబు నాయుడు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాడు. అయితే దగ్గుబాటి వెంకటేశ్వర రావు , నందమూరి హరికృష్ణలకు చిప్పిన విధంగా చెయ్యలేదు . అప్పుడు వారు మోసపోయామని తెలుసుకున్నారు .
నిజానికి రామారావుకు లక్ష్మి పార్వతి ని తన వారసురాలిగా చెయ్యాలనే తలంపు లేదని అంటారు . తమ కుటుంబంలో బాగా చదువుకొని చురుగా వుండే పురందేశ్వరి అంటే రామారావుకు చాలా ఇష్టమట . ఆమెనే తమ వారసురాలిగా చెయ్యాలని భావించారట . 1983లో ఆయన అధికాలోకి వచ్చాక విజయవాడలో మహానాడు నిర్వహించారు . ఈ మహానాడుకు భార్య బసవ తారకంతో పాటు పురందేశ్వరి ని ఆహ్వానించాడట . అప్పుడు పురందేశ్వరి వయసు కేవలం 24 సంవత్సరాలు . ఆ తరువాత కూడా రామారావు రాజకీయ సభలకు పురందేశ్వరి వెళ్ళింది . అయితే ఈ విషయం రామారావు పురందేశ్వరికి ఎప్పుడు చెప్పలేదు . పురందేశ్వరి గ్రహించలేదు . వైస్ రాయ్ ఘటన తరువాత పురందేశ్వరి చాలా గిల్టీగా ఫీల్ అయిందట . తండ్రి ని కలవడానికి వెడుతున్నట్టు కుటుంబసభ్యులకు చెబితే అందరు ఆయన చాలా కోపంగా వున్నారు , వద్దు అని సలహా ఇచ్చారట . అయినా ఆమె వినకుండా బాలకృష్ణను వెంట పెట్టుకొని వెళ్లిందట. బాలకృష్ణ మాత్రం లోపలకు వెళ్లే ధైర్యం చెయ్యలేక బయటే వున్నాడట . కోపంతో ఉంటే తన తండ్రి కొడతాడు , కొడితే ఆయన కోపం చల్లారుతుంది అనే ఉద్దేశ్యం తో పురందేశ్వరి లోపలకు వెళ్లిందట . పురందేశ్వరిని చూడగానే “రామ్మా ” అని ఆహ్వానించాడట . “ముసలివాడిని అందరు కలసి మోసం చేశారు కదా !” అన్నాడట ఆ మాటలు పురందేశ్వరి మనసులో ముళ్ళుగా గుచ్చుకున్నాయట. ఆమెకీ తెలియకుండానే కళ్ళు చెమ్మగిల్లాయట .
1996లో రామారావు చనిపోయిన తరువాత పురందేశ్వరి ఇంటికే పరిమితమైపోయింది . ఇక తెలుగు దేశం పార్టీలో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదనే ఉద్దేశ్యంతో 2004లో భర్త తో పాటు ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరింది . బాపట్ల పార్లమెంట్ నియోజక వర్గం లో తెలుగుదేశం సిట్టింగ్ పార్లమెంట్ సభ్యుడు దగ్గుబాటి రామానాయుడు ను ఓడించింది . రామారావు కూతురుగా అందరి గుర్తిపు, గౌరవం సంపాదించింది . సోనియాగాంధీ 2006లో పురందేశ్వరికి మానవ వనరుల శాఖ మంత్రిగా పదవి భాద్యతలు అప్పగించారు . 2014లో రాష్ట్ర విభజన తరువాత ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు . చంద్ర బాబును ఓడించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నది. జూనియర్ ఎన్టీఅర్ తో పురందేశ్వరి సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నది . ఆమె మనసులో ఎలాంటి ప్లాన్ వుందో మరి ?