ప్రచారంలో దూకుడు పెంచిన డికె అరుణ బిడ్డ స్నిగ్ధారెడ్డి (వీడియో)

గద్వాల తాజా మాజీ ఎమ్మల్యే డికె అరుణ కూతురు డికె స్నిగ్ధారెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. మల్దకల్ మండలంలోని స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే సమస్యలన్నీ తీరుతాయని టిఆర్ ఎస్ ప్రభుత్వం ఒరగబెట్టిందేమి లేదన్నారు. అందరి దగ్గరికి వెళ్లి కాంగ్రెస్ చేసిన పనుల గురించి స్నిగ్దా వివరించారు. కారు పార్టీ పనికి రాని పార్టీ అని స్నిగ్దారెడ్డి ప్రజలకు వివరించారు. స్నిగ్దా రెడ్డి మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.