స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో బాబు క్వాష్ పిటిషన్ సుప్రీం కోర్టులో ఉండగా.. బెయిల్ పిటిషన్ లు ఏపీ హైకోర్టులో ఉన్నాయి. మరోపక్క సీఐడీ కష్టడీ పిటిషన్ ఏసీబీ కోర్టులో ఉంది. ఇప్పుడు బాబు బయటకు రావలంటే అది పూర్తిగా న్యాయస్థానల పరిధిలోని విషయం.
అయితే చంద్రబాబు కక్కుర్తి మనిషి కాదు, వయసు 73 ఏళ్లు, అందువల్ల దయచేసి వదిలేయండి డిఫరెంట్ గా రిక్వస్ట్ చేస్తున్నారు డైరెక్టర్ రవిబాబు. వ్యవహారం న్యాయస్థానల పరిధిలో ఉందన్న విషయం మరిచారో ఏమో కానీ… మీరు తలచుకుంటే చిటికెలో పని అయిపోద్దని ఎవరినో పేరు చెప్పకుండా రిక్వస్ట్ చేస్తుండటం గమనార్హం.
ఒకపక్క చంద్రబాబు అరెస్ట్ పై టాలీవుడ్ నుంచి ఊహించిన స్థాయిలో రియాక్షన్ రాలేదని కామెంట్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో డైరెక్టర్ రవిబాబు స్పందించారు. ఇందులో భాగంగా ఒక వీడియోను విడుదల చేసిన ఆయన… జీవితంలో ఏదీ శాస్వతం కాదని.. సినిమా వాళ్ల గ్లామర్ కానీ, రాజకీయ నాయకుడి పవర్ కానీ ఏదీ శాస్వతం కాదుని.. అదేవిధంగా చంద్రబాబుకి వచ్చిన కష్టాలు కూడా శాస్వతం కాదని మొదలుపెట్టారు.
రామారావు ఫ్యామిలీ, చంద్రబాబు ఫ్యామిలీ.. తన ఫ్యామిలీకి చాలా ఆప్తులని రవిబాబు… చంద్రబాబు ఒకపనిచేసే ముందు వంద యాంగిల్స్ లో చూస్తారని.. అందరినీ సంప్రదించి, ఎవ్వరికీ ఇబ్బంది కగలకుండా డెసిషన్ తీసుకుంటారని అన్నారు. ఇదే సమయంలో చంద్రబాబుకి భూమిమీద ఇవాళే ఆఖరి రోజు అని తెలిసినా కూడా.. రాబోయే 50 సంవత్సరాల గురించి కూర్చుని ప్లాన్స్ వేస్తారని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో… చంద్రబాబు డబ్బు కోసం కక్కుర్తి పడే మనిషి కాదని.. అలాంటి మనిషిని సరైన ఆధారం లేకుండా జైల్లో పెట్టి ఎందుకు వేధిస్తున్నారో తనకు అర్ధం కావడం లేదని అన్నారు. ఇక రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులూ అత్యంత సహజం అని చెప్పిన రవిబాబు… 73ఏళ్ల వయసున్న వ్యక్తిని జైల్లో పెట్టి హింసించడం ఏ ఎత్తో పైఎత్తో అయితే మాత్రం అది చాలా దారుణం అని అభిప్రాయపడ్డారు.
ఇదే క్రమంలో… “అశాస్వతమైన పవర్ ఉన్నవాళ్లకి హంబుల్ రిక్వస్ట్… ఏ పవర్ వాడి చంద్రబాబుని జైల్లో పెట్టారో, దయచేసి అదే పవర్ ని ఉపయోగించి ఆయన్ని వదిలేయండి” అని అడుగుతున్నారు. దీంతో చట్టాలపైనా, న్యాయవ్యవస్థపైనా రవిబాబుకు బాగా అవగాహన ఉన్నట్లుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. పైగా… “మీరు చిటికెస్తే అది జరిగిపోతుందని అందరికీ తెలుసు అని, ఆయన్ని బయట ఉంచి ఇష్టమొచ్చినట్లు ఇన్వెస్టిగేషన్ చేసుకోండని” పేరు ప్రస్థావించకుండా సుచనలు చేయడం కొసమెరుపు.
ఇక, చంద్రబాబు అయితే దేశాన్ని వదిలి కచ్చితంగా పారిపోడని ష్యూరిటీ ఇస్తున్న రవిబాబు… “దేశం మిమ్మల్ని ఎలా గుర్తుంచుకోవాలనుకుంటున్నారు?… “కక్షతో రగిలిపోయే కసాయివాళ్ల లాగానా.. లేక, జాలి మనసు ఉన్న మంచి నాయకుడిలాగానా?” అని ప్రశ్నించారు. ఫైనల్ గా … దయచేసి చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టమని, అందుకు అంతా కృతజ్ఞతగా ఉంటారని చెప్పుకొచ్చారు! ఇన్ని చెప్పారు కానీ… అలా చేతులు జోడించి ఎవరిని రిక్వస్ట్ చేశారన్నది మాత్రం స్పష్టం చేయలేదు!