ఆర్ఆర్ఆర్ ఇంట్లో లోకేష్ తో డిన్నర్ పార్టీ… ఫేర్ వెల్?

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న అనంతరం… నారా లోకేష్ ఢిల్లీ ప్రయాణమై వెళ్లారు. నాటి నుంచీ ఆయన అక్కడే ఉంటున్నారు. ఈ సమయంలో తాజాగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ కేసులో దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. 41ఏ కింద నోటీసులు ఇచ్చి లోకేష్ ను విచారించమని ఏపీ సీఐడీకి సూచించింది.

దీంతో ఏపీ సీఐడీ అధికారులు ఆ నోటీసులు పట్టుకుని హస్తినకు బయలుదేరుతుతున్నారని వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రేపో, ఎల్లుండో చినబాబు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అంటున్నారు. ఈ సమయంలో ఢిల్లీలో శనివారం డిన్నర్ పార్టీ ప్లాన్ చేశారు. ఢిల్లీలో ఉన్న కమ్మ సామాజికవర్గానికి చెందినవారికి మాత్రమే అన్నట్లుగా ఈ పార్టీ నిర్వహించబోతున్నారని సమాచారం!

అవును… ఢిల్లీ పరిధిలోని కమ్మ సంఘం వారి కోసం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కమ్మ సామాజికవర్గం జనాలతో మాట్లాడి, బాబు హయాంలో వారికి జరిగిన మేలులను గుర్తు చేస్తూ, ఇప్పుడు వారి అవసరం పార్టీకి ఉందని చెప్పబోతున్నారని అంటున్నారు. అందుకే ఢిల్లీ పరిధిలో కమ్మ సామాజిక వర్గ జనం కోసమే ప్రత్యేకంగా ఒక డిన్నర్ పార్టీని ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది!

“న్యూఢిల్లీలో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇంటిలో శనివారం “లోకేష్ మీట్ అండ్ గ్రీట్” కార్యక్రమాన్ని కమ్మ సంఘం ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని నార్త్ అవెన్యూలో ఈ కార్యక్రమం శనివారం సాయంత్రం 7 గంటలకు టీతో ప్రారంభమై.. రాత్రి నాన్-వెజ్ డిన్నర్‌తో ముగుస్తుంద్ది” అని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సదరు ఆహ్వానంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి రఘురామ కృష్ణంరాజు హోస్ట్ కాగా… నారా లోకేష్, సీనియర్ న్యాయవాది లూథ్రా లు గెస్ట్ లు అని తెలుస్తుంది.

కారణం ఏదైనా.. సందర్భం మరేదైనా.. ఈ సమయంలో గెట్ టుగెథర్ ఏర్పాటు చేశారంటే ఏదో కీలక విషయమే చర్చించే అవకాశం ఉందని కొంతమంది ఈ సందర్భంగా కామెంట్ చేస్తుంటే… లోకేష్ కు ఫేర్ వెల్ అని మరికొంతమంది వెటకారమాడుతున్నారు! ఏది ఏమైనా… ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది!