YS Jagan: జగన్ ప్రణాళికలు ఫలించలేదా?

గత ఎన్నికల ముందు వైఎస్ జగన్ చేసిన వ్యూహాలు అనుకున్న మేరకు విజయవంతం కాలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలను మార్చడం, కొత్తవారికి అవకాశాలు కల్పించడం వంటివి పార్టీకి పెద్దగా కలిసిరాలేదు. ప్రజల మద్దతు నవరత్నాల మీదనే ఉంటుందని జగన్ విశ్వసించినా, ఆ ప్రయోగాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. తాను ఎంపిక చేసినవారు కూడా విజయం సాధించకపోవడంతో ఆ నియోజకవర్గాల్లో పార్టీ బలహీనంగా మారిపోయింది.

విజయవాడ పశ్చిమ, మైలవరం, తిరువూరు వంటి స్థానాల్లో కొత్త అభ్యర్థులను నిలబెట్టినా గెలిచేస్తారనే భరోసాతో జగన్ నిర్ణయాలు తీసుకున్నారు. కానీ, ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో ఆ అభ్యర్థులు రాజకీయంగా వెనుకబడిపోయారు. ఒకప్పుడు వైసీపీ తరఫున ముందుండే వారు ఇప్పుడు పూర్తిగా మౌనం పాటిస్తున్నారు. గతంలో ఏ వృత్తిలో ఉన్నారో, అదే దారిని తిరిగి ఎంచుకున్నారు.

ఇదే పరిస్థితి అభ్యర్థులను మార్చిన మరికొన్ని నియోజకవర్గాల్లోనూ కనిపిస్తోంది. నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు ప్రజలకు కనబడడం కూడా తగ్గిపోయింది. ఓటమిని జీర్ణించుకోలేకపోవడమో, పార్టీ మీద ఆసక్తి తగ్గిపోవడమో కారణమై ఉండొచ్చు. అయితే, పార్టీ నాయకత్వం వారికి మద్దతుగా నిలబడకపోవడం, తిరిగి వారిని వినిపించేలా చేయకపోవడం ప్రధాన సమస్యగా మారింది.

ఈ పరిణామాలతో జగన్ ప్రయోగాలు పార్టీకి పెద్దగా మేలు చేయలేదనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. కొత్తవారికి అవకాశం ఇచ్చినా, వారిని గెలిపించే ప్రయత్నాలు విఫలమవడం వల్లనే వైసీపీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ మరోసారి తన వ్యూహాన్ని సమీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పవచ్చు.

మన టైం వస్తుంది || YS Jagan Shocking Comments After Meeting Vallabhaneni Vamsi || Chandrababu || TR