చంద్రబాబుకు ఢిల్లీలో మద్దతే దొరకలేదా ?

అవును చంద్రబాబునాయుడు ఢిల్లీకి వెళ్ళి ఏమి సాధించారో ఎవరికీ అర్ధం కావటం లేదు. పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవిఎంలపై విమర్శలు, ఆరోపణలు మొదలుపెట్టారు. అంతకుముందు కొందరు ఉన్నతాధికారుల బదిలీలపై కూడా అడ్డదిడ్డమైన వాదనలు ఇంకా కంటిన్యు చేస్తునే ఉన్నారు. మొత్తానికి రెండు రోజుల పాటు దేశ రాజధానిలో ఉండి ఏమి సాధించారంటే ఏమీలేదనే సమాధానం చెప్పుకోవాలి.

తనకు ఎప్పుడు సమస్యలు ఎదురైనా ఢిల్లీకి వెళ్ళిపోయి గగ్గోలు పెట్టేయటం చంద్రబాబుకు అలవాటే. 2014లో గెలిచినపుడు ఈవిఎంల్లో లోపాలు గుర్తుకు రాలేదు. నంద్యాల బై ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత కూడా ఈవిఎంల గురించి ఎక్కడా మాట్లాడలేదు. కానీ మొన్నటి పోలింగ్ రోజున మధ్యాహ్నం నుండే గోల మొదలుపెట్టారు. ఉదయం 10 గంటల వరకు ట్రెండ్స్ గమినించిన తర్వాత వైసిపికి సానుకూలంగా ఉందని అర్ధమైందట.

ఎప్పుడైతే పోలింగ్ పై ఫీడ్ బ్యాక్ వచ్చిందో 11 గంటల ప్రాంతంలో ఈవిఎంలు మొరాయిస్తున్నాయంటూ ఆరోపణలు మొదలుపెట్టారు. ఏకంగా 30 శాతం సరే తర్వాత జరిగిన విషయాలన్నీ అందరికీ తెలిసిందే.  సిఈసితో తేల్చుకుంటానని ఢిల్లీకి వెళ్ళిన చంద్రబాబుకు సరైన మద్దతు దొరకలేదని సమాచారం. ఎందుకంటే, పార్లమెంటు ఎన్నికలతో ఉత్తరాధి రాష్ట్రాల్లో  చంద్రబాబు మద్దతుదారులు బిజీగా ఉన్నారు.

పైగా చంద్రబాబు అభ్యంతరాలను కేంద్ర ఎన్నికల కమీషనర్ అరోరా కొట్టి పారేశారు. అసలే ఇంటెలిజెన్స్ ఐబి బదిలీపై సిఈసితో పెద్ద వివాదాన్నే పెట్టుకున్నారు. కాకపోతే కోర్టు మొట్టికాయలతో చేసేదిలేక  నోర్మూసుకుని కూర్చున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ముగ్గురు ఎస్పీల బదిలీలపై ఎన్నికల కమీషన్ నొరుపారేసుకున్నారు.  ఎన్నికల కమీషన్ నిర్ణయాలను తప్పుపుడుతు, నోటికొచ్చినట్లు తిడుతూ మళ్ళీ న్యాయం కోసం అదే ఎన్నికల కమీషన్ దగ్గరకు వెళ్ళటం చంద్రబాబుకు మాత్రమే చెల్లింది.