తెలుగునాట రాజకీయాల్లో మళ్ళీ పరకాల ప్రభాకర్ సౌండింగ్ ఓ మోస్తరుగా మొదలైంది. చంద్రబాబు హయాంలో ‘సలహాదారు’గా పదవి వెలగబెట్టిన పరకాల ప్రభాకర్, ఆ తర్వాత రాజకీయ తెరపై కనిపించలేదు. స్వయం ప్రకటిత మేధావి ఈయన.! గతంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పని చేశారు. ఆ పార్టీ మీద విషం చిమ్మారు. కాంగ్రెస్ నుంచీ, బీజేపీ నుంచి కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అక్కడికేదో పోటీ చేసిన ప్రతిసారీ బంపర్ మెజార్టీతో గెలిచేసినట్లు పరకాల ప్రభాకర్, ఇతరుల ఓటమి గురించి సెటైర్లేస్తుంటారు.
పైగా, బాడీ షేమింగ్‌కి కూడా దిగాడీయన సోషల్ మీడియా వేదికగా. ‘దాక మొహం’ అనీ, ‘పిత్తపరిగె’ అనీ సెటైర్లేశారు. ఎవరి మీదనో తెలుసు కదా.? ఇంకెవరి మీద.? ఒకప్పటి ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి మీదా, ప్రస్తుత జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీదా.! చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో ఏదో అన్నారట, ఈయన రెగ్యులర్‌గా వారిని తిట్టేందుకు కొంత సమయం కేటాయిస్తున్నాడట.
తాజాగా, ‘పోయి, బ్లాక్ టిక్కెట్లు అమ్ముకోండి’ అంటూ చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులకు ఉచిత సలహా పారేశాడు పరకాల. ఏదీ పైత్యం.? అంటే, ఆయన స్థాయి అంతే.! సోషల్ మీడియా వేదికగా, అత్యంత జుగుప్సాకరమైన బూతుల్ని ప్రయోగించిన పరకాల, ‘ఆ ఘనకార్యం నాదే’ అని ఇంకా ఘనంగా చాటుకున్న సంగతి తెలిసిందే.