చంద్రబాబుకు వరుస షాకులు.. వాళ్లు ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తారట!

Vijayawada: Andhra Pradesh Chief Minister N. Chandrababu Naidu addresses a press conference, in Vijayawada, on May 5, 2019. (Photo: IANS)

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సొంత పార్టీ నేతలే షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారా? అనే ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ నుంచి టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని కేశినేని నాని చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటే ఈ తరహా బెదిరింపులు చాలామంది నేతల నుంచి ఎదురయ్యే అవకాశాలు అయితే ఉంటాయి.

ఈ మధ్య కాలంలో చంద్రబాబుకు వరుస షాకులు తగులుతున్నాయి. పార్టీకి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం చంద్రబాబుకు షాకిస్తుండగా మరోవైపు ఇతర నేతలు సైతం షాకిచ్చే దిశగా కామెంట్లు చేస్తున్నారు. చంద్రబాబు టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా తమకు ఇబ్బంది లేదని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. చంద్రబాబు ఎంత కష్టపడినా ఫలితాలు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు.

చంద్రబాబు ఎన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నా వైసీపీని ఎలా ఎదుర్కోవాలో ఆయనకు అర్థం కావడం లేదు. 2019 ఎన్నికల ఫలితాలే రిపీట్ అయితే ఏం చేయాలనే ప్రశ్నకు చంద్రబాబు దగ్గర సమాధానం లేదు. లోకేశ్ పాదయాత్ర త్వరలో మొదలుకానున్న నేపథ్యంలో ఆ పాదయాత్రకు సరైన రెస్పాన్స్ రాకపోతే ఏం చేయాలనే ప్రశ్నకు కూడా చంద్రబాబు దగ్గర సమాధానం లేదు.

జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల పార్టీకి లాభం కలుగుతుందో నష్టం కలుగుతుందో అర్థం కావడం లేదు. చంద్రబాబు ప్రస్తుతం విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు అనుకూలంగా రాకపోతే చంద్రబాబు రాజకీయాలకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.