తెలుగు రాష్ర్టాల్లో జాతీయ పార్టీ కాంగ్రెస్ పరిస్థితి ఏలా ఉందో తెలిసిందే. తెలంగాణ రాష్ర్టంలో కనీసం కాస్తా కూస్తో బలమైన నాయకులైన ఉన్నారు. రేవంత్ రెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, కొమటరెడ్డి లాంటి వారు గట్టిగా సౌండింగ్ అయినా చేయగల్గుతు న్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి చూసుకుంటే అసలు ఏపీలో ఆ పార్టీ ఉందా? అన్న సందేహం రాక మానదు. పార్టీలో వివిధ పార్టీల్లో పనిచేసిన సీనియర్ నేతలున్నా? అధికార పక్షాన్ని విమర్శించడంలో ఎప్పుడూ విఫలమే. టీటీపీ ఓవైపు..జనసేన బీజేపీ కలిసి మరోవైపు ప్రయాణం సాగిస్తున్నాయి. అధికార పక్షాన్ని విమర్శించే పార్టీలు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలే వినిపిస్తా యి తప్ప కాంగ్రెస్ అనే ఓ పార్టీ ఉందన్నది కూడా జనాలు మర్చిపోయారంటే! అతి శయోక్తి కాదేమో అనిపిస్తుంది.
తెలుగు రాష్ర్టాన్ని రెండు రాష్ర్టాలుగా విభజించిన నాటి నుంచి కాంగ్రెస్ కు ఈ దుస్తితి వచ్చింది. అవసరం మేర వాడుకుని వదిలేసిన కేసీఆర్… వ్యక్తిగత కారణాలుగా జగన్ మోహన్ రెడ్డి ఆ పార్టీని విబేధించి సొంత పార్టీలతో ముందుకెళ్తున్నారు. నాటి నుంచి నేటి వరకూ కాంగ్రెస్ లో ఇసుమొత్తు కూడా మార్పు రాలేదు. మొత్తంగా చూసుకుంటే రెండు రాష్ర్టాల్లోనూ కాంగ్రెస్ నుంచి కనీసం పోటీ చేసే అభ్యర్ధులు కూడా కరువయ్యారేమో అనిపిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ హైకమాండ్ పార్టీ బలోపేతం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ర్టాలకు కొత్త ఇంచార్జ్ లను నియమించింది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా మాణిక్యం ఠాగూరును…ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గా ఉమెన్ చాందీనిని నియమించింది. మరి ఈ కొత్త సారథలు పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తారేమో చూడాలి. ప్రస్తుతం ఏపీలో రెండవ అతి పెద్ద రాజకీయ పార్టీ గా ఆవిర్భవించడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఏపీలో జనసేనను మిత్ర పక్షంగా చేసుకుని ముందుకెళ్తోంది. అటు తెలంగాణలోనూ బీజేపీ బలం పెరుగుతోంది. మరి ఇలాంటి పోటీ వాతావరణం నడుమ కాంగ్రెస్ నూతన సారథులు ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారో చూడాలి.