ఖైరతా బాద్ నియోజకవర్గానికి ఎంపిక చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్‌కుమార్ నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి తిరస్కరించారు. ఆయన తరఫున నామినేషన్ దాఖలు చేసేందుకు కొంతమంది సహచరులు ఖైరతాబాద్ రిటర్నింగ్ అధికారి వద్దకు వచ్చారు. అయితే అభ్యర్థి లేకపోవడం, ప్రతిపాదిస్తున్న వారు కూడా ప్రత్యక్షంగా లేకపోవడం వల్ల రిటర్నింగ్ అధికారి ముషారఫ్ ఫారుకి నామినేషన్ పత్రాలను స్వీకరించ లేదు.
ఒక అభ్యర్థి నామినేషన్ స్వీకరించాలంటే అభ్యర్థి స్వయంగా హాజరుకావాలి లేదా ఆయన ప్రతిపాదించిన ఓటరు తప్పకుండా ఉండాలి. అయితే ఈ రోజు దాసోజు రాలేదు. ఆయన తరఫున నామినేషన్ పత్రాలు సమ్పించాల్సిన ఇద్దరు ప్రతినిధులు కూడా లేరు. ఫలితంగా ఆయన నామినేషన్ ను రిటర్నింగ్ తీసుకోలేదు.
అయితే, దీనివల్ల వచ్చే నష్టమేమీ లేదు. నామినేషన్ వేసేందుకు చాలారోజులు గడువుంది. నంబర్ 19 దాకా అభ్యర్థులు నామినేషన్ వేయవచ్చు.