అల్లు వారి “అల్లు స్టూడియోస్” కి అభిమానుల ఆశీస్సులు కావాలి :అల్లు ఫ్యామిలీ

comencement of allu studios on the occasion of allu ramalingaih 99th birth anneversary

ఈ రోజు అల్లు రామలింగయ్య గారి 99 వ జయంతి, తన హావభావాలతో గత మూడు శతాబ్దాల కాలంలో తెలుగు ప్రజలని కడుపుబ్బా నవ్వించి ఎన్నో మంచి పాత్రలతో తెలుగు వారి మదిలో నిలిచిపోయిన గొప్ప హాస్య నటుడు మన అల్లు రామలింగయ్య గారు జన్మించి 99 సంవత్సరాలు అయ్యిన సందర్భంగా అల్లు స్టూడియోస్ ను ఏర్పాటు చేయబోతున్నట్లుగా అల్లు వారి కుటుంబం అధికారికంగా ప్రకటించారు. అల్లు కుటుంబం మొత్తం కలిసి ఈ స్టూడియో ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు . త్వరలోనే స్టూడియో నిర్మాణ పనులు మొదలు పెట్టబోతున్నట్లుగా అల్లు వారు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

comencement of allu studios on the occasion of allu ramalingaih 99th birth anneversary
comencement of allu studios

హైదరాబాద్ గండిపేట శివారు ప్రాంతంలో ఇప్పటికే అల్లు వారు 10 ఎకరాల భూమిని సేకరించారట. అందులోనే ఈ స్టూడియోను ఏర్పాటు చేసేందుకు రెడీ అవుతున్నారు. అల్లు రామలింగయ్య 100వ జయంతి వరకు స్టూడియో పనులు పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారట. అంటే ఏడాది కాలంలోనే స్టూడియో నిర్మాణంను పూర్తి చేసేందుకు అల్లు వారు ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఇదే సమయంకు అంటే అల్లు రామలింగయ్య శత జయంతి సందర్బంగా ఈ స్టూడియోను ప్రారంభించాలని అల్లు ఫ్యామిలీ భావిస్తున్నారట. అల్లు అరవింద్ తనయుడు బాబీ.. బన్నీ.. శిరీష్ లు తమ తాతయ్య పేరు మీద కట్టబోతున్న ఈ స్టూడియో కి అభిమానుల ఆశీస్సులు , శుభాకాంక్షలు కావాలని కోరారు.