గుంటూరు నుంచి అలీ పోటీ…ఓటు,ఇల్లు అన్ని రెడీ

హాస్య నటుడు అలీ గుంటూరు నగరంలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఆయన వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.ఈ నేపథ్యంలో గుంటూరులో ఓటు హక్కు కల్పించాలని కోరుతూ తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి దరఖాస్తు అందజేశారు.

దరాఖాస్తు ని పరిశీలించిన అధికారులు ఇప్పటికే హైదరాబాద్‌లో ఓటరుగా నమోదై ఉన్నారని తెలుసుకుని ఆ విషయాన్ని అలీకి చెప్పారు. తనకు తెలంగాణలో ఓటు హక్కు తొలగించినా అభ్యంతరం లేదని, గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఓటు హక్కు కల్పించాలని ఆయన కోరారు. ఆయన తెలుగుదేశం పార్టి నుంచి నిలబడనున్నారు అనే విషయం తెలుస్తోంది.

చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తారని ఖరారు కాగానే గుంటూరు ఇల్లు తీసుకున్నారని వినికిడి. అక్కడ ముస్లిం ఓటర్స్ ఎక్కువ మంది ఉండటంతో అలీకు రాజమండ్రి అడిగినా అక్కడ సీట్ ఇస్తున్నారని తెలుస్తోంది.