విద్యావ్యవస్థలో సమూల మార్పుల దిశగా జగన్ అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే నాడూ నేడూ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చిన జగన్… ఇక పాఠ్యాంశాల విషయంలోనూ తనమార్కు మార్పుకు శ్రీకారం చుట్టబోతున్నారని తెలుస్తుంది.
అవును… ఏపీ విద్యావ్యవస్థలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతున్నారు సీఎం జగన్. ఇప్పటికే ప్రాథమిక స్థాయిలో సీబీఎస్ఈ సిలబస్ ను ప్రవేశపెట్టగా.. ఇప్పుడు ఉన్నత విద్యలో కూడా సంచలనాత్మకమైన మార్పులు చేసేందుకు ఆయన ప్రయత్నం మొదలు పెట్టారు. దీంతో ఇకపై డిగ్రీ సహా ఇతర కోర్సుల్లో ఎవ్వరూ ఊహించని సబ్జెక్ట్ లు రాబోతున్నాయి.
ఇకపై ఏపీలోని బీకామ్ లో కేవలం ఫైనాన్స్ మాత్రమే కాకుండా.. ఇకపై రిస్క్ మేనేజ్ మెంట్, అసెట్ మేనేజ్ మెంట్, రియల్ ఎస్టేట్ మేనేజ్ మెంట్, ఫైనాన్స్ మేనేజ్ మెంట్ వంటి అనేక వర్టికల్స్ ని కరికులమ్ లో భాగం చేయాలంటున్నారు జగన్. విదేశీ విద్యకు మనకు తేడా అక్కడే ఉందని చెబుతున్న ఆయన… విదేశాల్లో వివిధ రకాల వర్టికల్స్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ప్యూచర్ టెక్నాలజీ స్కిల్స్ పై హైపవర్ వర్కింగ్ గ్రూపుతో సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమీక్షలో విద్యాశాఖ అధికారులతోపాటు, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, నాస్కామ్, అమెజాన్ వెబ్ సర్వీసెస్, డేటావివ్ వంటి సంస్ధల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా… ఇంకా మనం స్టేట్ సిలబస్, సీబీఎస్ఈ, నేషనల్ సిలబస్ అనే అంశాల వద్దే ఆగిపోయామని చెప్పిన జగన్… ప్రపంచం ఇప్పుడు ఇంటర్నేషనల్ బాకలారియేట్ (ఐబీ) వైపు వెళ్తోందని దాన్ని మనం అందిపుచ్చుకోవాలని అన్నారు. అప్పుడే విదేశాల్లోని విద్యార్థులతో మన పిల్లలు పోటీపడగలుగుతారని సీఎం చెప్పారు!
భారత్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వంటి వర్టికల్స్ అభివద్ధి చాలా తక్కువగా ఉందని, వాటిని బోధించే సిబ్బంది కొరత ఎక్కువుగా ఉందని తెలిపిన జగన్… ఇకపై వీటిని పాఠ్యప్రణాళికలో భాగం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఫలితంగా… వర్చువల్ రియాలిటీ, అగ్ మెంటెడ్ రియాలటీ వంటి అంశాలు కరికులమ్ లో చేర్చాలని జగన్ సూరించారు.
దీంతో… ఈ స్థాయిలో ఏపీ విద్యారంగంలో మార్పులు చేస్తే… ఫ్యూచర్ లో ఏపీ విద్యార్థులు విదేశాలకు వెళ్లి చదువుకునే ఆలోచనకు స్వస్థిపలుకుతారని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో విద్యారంగంలో ఈస్థాయి మార్పులు.. స్వతంత్ర భారతవనిలో ఏ రాష్ట్రంలోనూ జరగలేదని గుర్తు చేస్తున్నారు!