మోదీ ప్రసంగం జగన్ కు సైతం నచ్చలేదా.. వాళ్లకు మోదీ ప్రాధాన్యత ఇవ్వరా?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు రాష్ట్రాలకు ఎప్పుడు వచ్చినా తమ ప్రభుత్వం గురించి గొప్పగా ప్రచారం చేసుకుంటారే తప్ప తెలుగు రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరేలా ఒక్క కామెంట్ కూడా చేయరనే సంగతి తెలిసిందే. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలకు భారీ స్థాయిలో ప్రయోజనం చేకూర్చే నరేంద్ర మోదీ ఇతర రాష్ట్రాల విషయంలో మాత్రం అదే స్థాయిలో ప్రేమను కనబరచడం లేదు.

ప్రజల ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకే మోదీ ప్రాధాన్యత ఇస్తున్నారు. బలమైన ప్రతిపక్షం లేకపోవడం కూడా మోదీ సర్కార్ తీసుకుంటున్న భారీ నిర్ణయాలకు కారణమని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. మోదీ ప్రసంగం జగన్ ను సైతం హర్ట్ చేసిందని తెలుస్తోంది. విభజన హామీల గురించి మోదీ మాట్లాడతారని జగన్ భావించగా అందుకు భిన్నంగా జరుగుతోంది.

మరోవైపు బీజేపీ ఏపీలో పుంజుకునే పరిస్థితులు సైతం కనిపించడం లేదని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. రాబోయే రోజుల్లో అయినా రాష్ట్రంలో బీజేపీ పుంజుకుంటుందేమో చూడాల్సి ఉంది. ప్రజాదరణ ఉన్న నేతలు బీజేపీలో లేకపోవడం కూడా ఆ పార్టీకి ఒక విధంగా మైనస్ అవుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

జగన్ కేంద్రం ద్వారా రాష్ట్రానికి బెనిఫిట్ కలిగే దిశగా అడుగులు వేయాలని కొంతమంది కోరుకుంటున్నారు. వైసీపీ బీజేపీ సన్నిహితంగా ఉండటం వల్ల ఈ రెండు పార్టీలకు ఒక విధంగా మేలు జరుగుతోంది. వైసీపీ బీజేపీ రాబోయే రోజుల్లో కూడా కలిసి పని చేస్తాయేమో చూడాల్సి ఉంది.