రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ భాద్యత టీడీపీదే నని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ రోజు కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన చేసిన అనంతరం మాట్లాడుతూ మోసం చేసిన వారికి గుణపాఠం చెప్పడానికే ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన చేస్తున్నట్లు ఆయన చెప్పారు. బ్రాహ్మణీ స్టీల్ ప్లాంట్ ఆగిపోయినప్పటి నుంచి ఈ ప్రాంత ప్రజలు అక్కడ స్టీల్ ప్లాంట్ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ఈ ప్రాంత డిమాండ్ గా విభజన చట్టంలోకి ఎక్కింది. అయితే, కేంద్రం ఈ ప్లాంట్ ఏర్పాటు మీద సరైన విధంగా స్పందించలేదు. ఇపుడు మొత్తానికి ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్ ఏర్పాట్లుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత ప్రజల మనసు చూరగొనేందుకు ఈ చంద్రబాబు తప్పక దోహకపడుతుంది.ఇది వేగంగా పూర్తి కావాలి. ఎన్నికల ప్రాజక్టు కాకూడదు.
ఈ రోజు శంకు స్థాపన కార్యకమ్రంలో ఆయన కేంద్రాన్ని తీవ్రంగా విమర్శంచారు. ప్లాంట్ నిర్మాణంలో కేంద్రం మోసం చేసిందని చెబుతూ కడపలో పరిశ్రమ ఏర్పాటు లాభదాయకమే అని నివేదించినా అడ్డంకులు సృష్టించిందని ముఖ్యమంత్రి ఆరోపించారు.
‘ నివేదికలతో పేరుతో 11సార్లు కాలయాపన చేసినా ఓపికగా సమాధానం ఇచ్చాం. కేంద్రం కనికరించ పోయినా ప్రతిపక్షం పశ్నించిన పాపాన పోలేదు. అరవై రోజుల్లో పరిశ్రమ ఏర్పాటు చెయ్యాలని అల్టిమేటం ఇచ్చినా కేంద్రం పెడ చెవిన పెట్టింది. అందుకే చాలెంజ్ గా తీసుకుని మొదటి విడతగా 18వేల కోట్లతో పనులను ప్రారంభిస్తాం,’ అని ముఖ్యమంత్రి చెప్పారు.
ఉక్కు ఫ్యాకరీ పేరుతో ఇష్టానుసారంగా ఖనిజాన్ని గాలి జనార్దన్ రెడ్డి అండ్ కో అమ్ముకున్నారని ఆయన చెప్పారు.
‘ బ్రహ్మణీ స్టీల్స్ పేరిట దోచుకున్న వేల కోట్లు ధనంతోనే జగన్ సాక్షి పేపర్, టీవీ ఛానెల్ పెట్టారని కూడా ముఖ్యమంత్రి ఆరోపించారు.
తెలుగుదేశం ప్రభుత్వ విధానాలతో రాయలసీమ జిల్లాలు పోటి పడి అభివృద్ధి చెందడం ఖాయమని అంటూ రాత్రిబవళ్ళు కష్టపడటంతోనే గండికోటకు నీళ్ళు తీసుకు రాగలిగామని అన్నారు. అయితే, ప్రతి పనికి ప్రతిపక్ష పార్టీ అడ్డంకులు సృష్టించిందని విమర్శించారు. ముఖ్యమంత్రి చెప్పిన మరికొన్ని ముఖ్యాంశాలు:
రాయలసీమ ను రతనాలసీమ గా తీర్చిదిద్దే భాద్యత టీడీపీదే.
ప్రాజక్టు పనులు పూర్తయితే 80టీఎంసీ ల నీటీని నిల్వ చేసుకునే అవకాశం.
ఆరునెలల్లో గోల్లపల్లికి నీరిచ్చి కియో మెటార్ సంస్థ తీసుకోచ్చాం.
నెలలోపు భూములు ఇస్తే మూడు నెలలో పరిశ్రమ పనులు ప్రారంభిస్తాం.
అందరిలా మాటలు చెప్పడం చేతకాదు.. ఇచ్చి హమీ అమలు చెయ్యడమే నా ద్యేయం..
ఓబుళాపురం ఖనిజాన్ని విదేశాలకు తరలించి జగన్ సొమ్ము చేసుకున్నాడు.
గోదావరి నీళ్ళు నాగార్జున సాగర్ కు తెస్తాం..
పరిశ్రమలకు అడ్డగా సీమను తీర్చిదిద్దుతాం…