Home Andhra Pradesh మెగా హీరోల రోడ్ షోలు...చిరు ఆదేశం, డిటేల్స్

మెగా హీరోల రోడ్ షోలు…చిరు ఆదేశం, డిటేల్స్

ఇప్పటివరకూ నాగబాబు తప్పించి ప్రత్యేక్ష్యంగా జనసేనను సపోర్ట్ చేస్తూ ప్రచారం చేసేందుకు మెగా హీరోలు ముందుకు రాలేదు. కానీ ఎలక్షన్స్ సమీపిస్తున్న ఈ సమయంలో చిరంజీవి స్వయంగా రంగంలోకి దిగి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసి ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయన తన కుటుంబంలోని మిగతా హీరోలతో కూడా చర్చించినట్లు సమాచారం.

మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు రామ్ చరణ్, నాగబాబు, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ, అల్లు అర్జున్, అల్లు శిరీష్ లు అంతా పవన్ కు సపోర్ట్ ఇస్తూ ప్రచారం చేయటానికి ఉత్సాహం చూపించిటనట్లు సమాచారం. ఈ మేరకు అతి త్వరలోనే డేట్స్ ఖరారు చేస్తారని, ఏ ప్రాంతంలో ఏ హీరో ప్రచారం చేయాలనే దానిపే పార్టీ పెద్దలు ఓ నిర్ణయానికి వస్తారని సమాచారం. అయితే పవన్ మాత్రం స్వయంగా ఎవరినీ తన పార్టీ ప్రచారానికి రమ్మని పిలవలేదని తెలుస్తోంది.

మెగా హీరోలు ఇలా రోడ్డు మీదకు వస్తే ఆ రచ్చ వేరేగా ఉంటుందంటున్నారు. ముఖ్యంగా రామ్ చరణ్, అల్లు అర్జున్ లకు ఓ రేంజిలో స్పందన వస్తుందంటున్నారు. అయితే చిరంజీవి ప్రచారానికి రాకుండా ఉంటేనే బెస్ట్ అంటున్నారు. ప్రచారానికి వస్తే మీడియాలో రకరకాల విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్తున్నారు. ఇక మెగా బ్రదర్ నాగబాబు ఈ ప్రచార కార్యక్రమాలకి వ్యూహకర్తగా ఉంటారని, ఆయన చొరవతోనే చిరంజీవి , తదితరులు ముందుకు వచ్చారని వినికిడి. మరో ప్రక్క మెగా ఫ్యాన్స్ తో కంటిన్యూగా మీటింగ్ లు జరుగుతూనే ఉన్నాయి.

- Advertisement -

Related Posts

నిమ్మగడ్డ సంచలన నిర్ణయం.. వారికి నామినేషన్ వేసేందుకు మళ్లీ అవకాశం !

ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎలక్షన్ కాక రేపుతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీ తీరుపై విమక్షలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. ఎస్ఈసీకి ఫిర్యాదుల వెల్లువెత్తుతున్నాయి. అసలు ఆగినచోట నుంచే ఎన్నికలు నిర్వహించడంపై అభ్యంతరాలు వ్యక్తం...

సజ్జల రామకృష్ణారెడ్డి కి షాక్ ఇచ్చిన నర్సాపురం ఎంపీ…!

ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డికి నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ట్విస్ట్ ఇచ్చారు. తన హక్కులకు భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేసిన సజ్జల రామకృష్ణారెడ్డిపై సభాహక్కుల ఉల్లంఘన కింద చర్యలు...

నిమ్మగడ్డ కి జగన్ సర్కార్ షాక్ .. హైకోర్టులో సవాల్ !

ఏపీలో మున్సిపల్ ఎన్నికలపై రచ్చ ప్రారంభం అయ్యింది. మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పలు ఆంక్షలు విధించింది. వాలంటీర్ల కదలికలపై గట్టి నిఘా పెట్టాలని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్‌...

Latest News