ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు.. రివర్స్ లో పడుతున్న సెటైర్లు!

చాలాకాలంగా రాజకీయాలకు, రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యలకూ దూరంగా ఉంటున్న మెగాస్టార్ చిరంజీవి… ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ బాస్ ఈస్ బ్యాక్ అన్నట్లుగా స్పందించారు. ఇందులో భాగంగా ఏపీ ప్రభుత్వంపై ప్రత్యక్షంగానూ.. మంత్రి అంబటిపై పరోక్షంగానూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అవును… తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలపై కౌంట‌ర్ ఇచ్చే క్రమంలో ఏపీ ప్రభుత్వంపై చిరంజీవి సంచలన వ్యాఖ్యలు చేశారు! ఇందులో భాగంగా యాక్టర్ల రెమ్యూనిషన్‌పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయని ప్రశ్నించిన చిరంజీవి.. ప్రభుత్వాలు ఏమి చెయ్యాలో చెప్పడం గమనార్హం.

“యాక్టర్ల రెమ్యూనిషన్‌ పై ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడతాయి. పిచ్చుకలు మీద బ్రహ్మాస్త్రంగా ఫీల్మ్ ఇండస్ట్రీ పైన పడతారేంటి. మీలాంటి వాళ్లు ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు, ఉద్యోగ – ఉపాధి అవకాశల‌ గురించి ఆలోచించాలి.. పేదవారి కడుపు నింపే ఆలోచనలు చేయ‌లి” అంటూ చిరంజీవి స్పందించారు.

దీంతో… సినిమా జనాలు సినిమా వేదిక‌ల‌పై రాజ‌కీయలు మాట్లాడితే త‌ప్పు కాదు కానీ.. అలాంటివారి గురించి రాజ‌కీయ నాయ‌కులు మాట్లాడితే తప్పా అని చిరంజీవిని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఈ సందర్భంగా… “రిపబ్లిక్” సినిమా ఫంక్షన్ లో పవన్ ప్రసంగాలు వినాలని చిరుకి సూచిస్తున్నారు.

ఇదే సమయంలో తన తమ్ముడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ మీటింగ్‌ లో రోజుకు తన సినిమా రెమ్యూనరేషన్ రెండు కోట్ల అని చెప్పిన వీడియోలపై చిరు ఓ లుక్కేయాలని అంటున్నారు. సినిమాలపై రాజకీయ నాయకులు స్పందించే పరిస్థితి కోరి మరీ తెచ్చుకుంది పవన్ అనే విషయం విజ్ఞులైన చిరు గమనించాలని సూచిస్తున్నారు.