వంశీని ఓడించడానికి 150కోట్లు రెడీ… తలలు పట్టుకుంటున్న తమ్ముళు!

దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాత గన్నవరంలో నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు, ఎన్టీఆర్‌ శతజయంతి ఉత్సవాల్లో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించిన చింతమనేని… గన్నవరంలో ఏమి జరుగుతుందోనని కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అక్కడ టిక్కెట్‌ కావాలంటూ 10 మంది వరకు పోటీపడుతున్నట్లు చెప్పారు. అనంతరం… ఇప్పటికే 150 కోట్లు ఖర్చు చేస్తానంటూ నా దగ్గరకు ఒక్కరు వచ్చారని చెప్పుకొచ్చారు. దీంతో… చింతమనేనిపై నిప్పులు చెరిగారు వంశీ.

అవును… టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేత చింతమనేని ప్రభాకర్‌ పై కౌంటర్‌ ఎటాక్‌ చేశారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్‌! దెందుళూరు సంగతి వదిలేసి గన్నవరంపై పడి ఎందుకు ఏడుస్తున్నాడు.. ముందు వాడి ఊరిలో వాడిని చూసుకోమనండి.. బకెట్‌ జారిన.. అడుగు జారిన యదవలంతా నానికి, నాకు చెబుతున్నారు.. మంగమ్మ శపథాలు చేస్తున్నారు అంటూ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు వంశీ!

ఈ సమయంలో వైసీపీ వెంటిలేటర్ పై ఉందంటూ టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపైనా ఆయన స్పందించారు. 23 మంది ఎమ్మెల్యేలు గెలిచి నలుగురు విభేదించిన టీడీపీ వెంటిలేటర్ మీద ఉందా? లేక.. 150 మంది గెలిచిన పార్టీ వెంటిలేటర్ పైన ఉందో చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. అనంతరం చంద్రబాబును టార్గెట్ చేసిన ఆయన… 74 ఏళ్లు వచ్చిన చంద్రబాబుకు పరిణితి రాలేదు సరికదా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు!

ఈ సందర్భంగా తన నియోజకవర్గం గన్నవరంలో పోటీపైనా ఆయన స్పందించారు. గన్నవరంలో ఎవరైనా పోటీ చేయొచ్చు అని.. వారూ వీరూ ఎందుకు నేరుగా చంద్రబాబు గానీ, లోకేష్ గానీ పోటీ చేయొచ్చని… ఈ విషయాన్ని తాను నేరుగా చాలాసార్లు చెప్పానని… తండ్రీకొడుకులిద్దరినీ గన్నవరంలో పోటీచేయడానికి ఆహ్వానిస్తున్నాని వంశీ చెప్పుకొచ్చారు!

దీంతో… ఈసారి ఖర్చుకు వెనకాడొద్దని.. భారీగా ఖర్చు చేసేవారికే సీట్లు ఇచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేసుకుంటున్నట్లు చింతమనేని వ్యాఖ్యలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. వంశీకంటే బలమైన నాయకులు, ప్రజాసేవ చేయగల నాయకులు, మంచి నాయకులూ రాబోతున్నారని చెప్పాల్సిన ప్రభాకర్… 150కోట్లు ఖర్చు చేసే వ్యక్తులు టీడీపీలో చేరబోతున్నారు.. గన్నవరంలో పోటీచేయబోతున్నారంటూ చెప్పడం ఏమిటని తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు!