దుర్గగుడి పాలక మండలికి ముఖ్యమంత్రి వార్నింగ్

నవరాత్రి ఉత్సవాల పుడు  ఇంద్రకీలాద్రి దుర్గమ్మ గుడిలో వివాదాలు చెలరేగడం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రోటో కోల్ అంటూ పండగ పూట  వరుస వివాదాల చెలరేగిన వార్త ల మీద ముఖ్యమంత్రి ఆరాతీశారు. కొత్త గా వచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోటేశ్వరమ్మ తో తగవు పెట్టుకునేందుకు పాలకమండలి యోచించడం పట్ల ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు.

ఐఆర్ ఎస్ క్యాడర్ కు చెందిన కోటేశ్వరమ్మ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఈవొ గా నియమించారు. అయితే,  ఉత్సవాల సందర్భంగా ప్రోటోకోల్ పాటించలేదని తెలుగుదేశం శాసన సభ్యుడు బోండా ఉమ మహేశ్వరరావు నానా యాగీ చేశారు. తర్వాత ఛెయిర్మన్ గౌరంగబాబును అవమానపరిచారని మరొక వివాదం చెలరేగింది. దీనితో పాలకమండలి కోటేశ్వరమ్మ మీద ఆగ్రహంతో ఉంది.  ఆమె తన ధోరణి మార్చుకోవాలని హెచ్చరిక చేశారు. అంతేకాదు, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని కూడా చెప్పారు.

పాలకమండలితో ఛెయిర్మన్ అత్యవసరం సమావేశం కూడా ఏర్పాటు చేశారని తెలిసింది. 

ఈ లోపు వ్యవహారం ముఖ్యమంత్రి దాకా వెళ్లింది. అంతే, ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

నవరాత్రి ఉత్సవాల కన్నా… ఆలయంలో వివాదాలే ఎక్కువగా ప్రచారం లోకి వస్తున్నాయని ముఖ్యమంత్రి  ఆగ్రహంతో ఉన్నారని ముఖ్యమంబత్రి కార్యాలయం నుంచి   పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు కు ఫోన్ వచ్చిందని తెలిసింది.

ఆలయంలో వివాదాలకు స్వస్తి చెప్పాలని ఆదేశించారని సిఎంవొ అధికారి ఒకరు ఛెయిర్మన్ కు చెప్పారు.

అధికారులతో సమన్వయంతో పని చేయాలని సూచన చేస్తూ, పాలకమండలి, తీరు మారకపోతే ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని హెచ్చరిక చేశారని తెలిసింది.