చంద్రబాబు రెండు ప్రకటిస్తే, పవన్ కళ్యాణ్ కూడా మరో రెండు ప్రకటించారు.! ఇందులో తప్పేముంది.? ఎవరికి కేటాయించబడిన సీట్లను వారు ప్రకటించుకుంటున్నారు కదా.? మధ్యలో వైసీపీ హడావిడి ఏంటి.? అని టీడీపీ సీనియర్ నేత బొండా ఉమామహేశ్వరరావు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
బొండా ఉమ వ్యాఖ్యలు జస్ట్ కవర్ డ్రైవ్‌లో భాగమే.! డ్యామేజీ కంట్రోల్ చర్యల నిమిత్తం చంద్రబాబే, బొండా ఉమాని రంగంలోకి దించారు. మొదట తప్పు చేసింది టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు. కూటమిలో వున్నప్పుడు, సొంతంగా టిక్కెట్లను ప్రకటించకూడదు.! కానీ, తప్పు చేసేశారు చంద్రబాబు.
దాంతో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి చిర్రెత్తుకొచ్చింది. ఆయనా రెండు సీట్లను తమ పార్టీ తరఫున ప్రకటించేసుకున్నారు. ఇదీ సంగతి. ఇక్కడ, జనసేన శ్రేణుల గౌరవాన్ని పవన్ కళ్యాణ్ కాపాడారు. కానీ, ప్రతిసారీ ఇది కుదరదు.! టీడీపీ మార్కు వెన్నుపోటు రాజకీయాలు ఇలానే వుంటాయ్.
టీడీపీకి అను‘కుల’ మీడియా వుంది. ఆ అను‘కుల’ మీడియా ద్వారా రాజకీయ ప్రత్యర్థుల మీద విషం చిమ్మడం చంద్రబాబు నైజం. ప్రత్యర్థులే కాదు, కుటుంబ సభ్యుల మీద ఇదే తరహా రాజకీయాన్ని చంద్రబాబు ప్రదర్శిస్తుంటారు. స్వర్గీయ ఎన్టీయార్ విషయంలో గతంలో ఏం జరిగిందో చూశాం.
జూనియర్ ఎన్టీయార్ విషయంలో ఏం జరుగుతోందో చూస్తున్నాం. అంతెందుకు, పవన్ కళ్యాణ్ అలాగే చిరంజీవి మీద కూడా టీడీపీ అను‘కుల’ మీడియాని చంద్రబాబు ఇలాగే ప్రయోగించారు, ప్రయోగిస్తూనే వున్నారు.
ఎన్నికల గోదారి దాటేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సాయం తీసుకుంటున్నారుగానీ, నిజానికి.. పవన్ కళ్యాణ్, చంద్రబాబుని అలా వాడుకుంటున్నట్లే కనిపిస్తోందిప్పడు.! చంద్రబాబుకి బ్యాడ్ టైమ్ నడుస్తోంది మరి.! అయితే, సంక్షోభంలో అవకాశాల్ని వెతుక్కునే చంద్రబాబుని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు.!