AP: బన్నీ అరెస్టు వెనుక చంద్రబాబు హస్తం… లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు!

AP: అల్లు అర్జున్ అరెస్ట్ విషయం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. ఒకవైపు సినీ ఇండస్ట్రీలో ఈ విషయం హాట్ టాపిక్ గా మారగా అల్లు అర్జున్ అరెస్టు విషయం రాజకీయాల పరంగా కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణమవుతుంది. అల్లు అర్జున్ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉంది అంటూ ఇప్పటికే ఆరోపణలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎంతోమంది వైకాపా నాయకులు బిఆర్ఎస్ నాయకులు కూడా ఈ అరెస్టు విషయంపై స్పందించారు.

తాజాగా అల్లు అర్జున్ అరెస్టు గురించి వైకాపా మహిళా నేత లక్ష్మీపార్వతి స్పందించారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్ట్ కావడం చాలా బాధాకరమని తెలిపారు.అయితే ఈయన అరెస్టు వెనక రాజకీయ కుట్ర దాగి ఉందని ఈమె మండిపడ్డారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి సంఘటనలు జరిగిన తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు హస్తం ఉంటుందని తెలిపారు. ఎందుకంటే ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా తెలంగాణలో ఆయన శిష్యుడు ముఖ్యమంత్రి కావడంతో ఆయన కనుసన్నల్లోనే ఇక్కడ పాలన సాగుతుందని తెలిపారు.

ఇలా తొక్కిసలాటలో అభిమాని మరణిస్తే అల్లు అర్జున్ ను అరెస్టు చేస్తే చంద్రబాబు నాయుడుని ఎన్నోసార్లు అరెస్టు చేయాల్సి ఉండేదని తెలిపారు. రాజమండ్రి పుష్కరాల్లో, కందుకూరులో ఘటనలో సమయంలో ఎంతోమంది తొక్కిసలాట జరిగి మరణించారు. ఈ విషయంలో చంద్రబాబును ఎన్నిసార్లు అరెస్టు చేయాలని లక్ష్మీపార్వతి ప్రశ్నించారు.

ఇలా అల్లు అర్జున్ అరెస్టు ఒక వైపు రాజకీయాల పరంగా కూడా పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది. మరోవైపు ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది అల్లు అర్జున్ అరెస్టును ఖండించడమే కాకుండా ఆయనకు మద్దతు తెలుపుతూ పోస్టులు చేస్తున్నారు. అల్లు అర్జున్ బయటికి రావడంతో సినీ సెలెబ్రిటీలంతా అల్లు అర్జున్ ఇంటికి క్యూ కడుతున్నారు.