రాయలసీమలో వ్యతిరేకత.. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ప్రణాళిక ఇదేనా?

Chandrababu and Pawan Kalyan showed cowardice

ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా రాయలసీమ కీలక పాత్ర పోషిస్తుందనే సంగతి తెలిసిందే. రాయలసీమలోని ఎనిమిది జిల్లాలలో చంద్రబాబుకు ఏ మాత్రం ప్రాధాన్యత లేదు. జనసేన సొంతంగా పోటీ చేసినా మరో పార్టీతో కలిసి పోటీ చేసినా రాయలసీమలో నామమాత్రంగా కూడా ప్రభావం చూపే అవకాశం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు గతంలో రాయలసీమపై నెగిటివ్ గా కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే.

చంద్రబాబు ప్రస్తుతం రాయలసీమ గురించి ఏమైనా మాట్లాడాలని అనుకుంటే గతంలో మాట్లాడిన విధంగా కాకుండా రాయలసీమ గురించి మంచిగానే మాట్లాడుతున్నారు. అయితే రాయలసీమ ప్రజల్లో చంద్రబాబు పవన్ లపై వ్యతిరేకత తగ్గుతుందో లేదో చూడాల్సి ఉంది. 2019లో రాయలసీమ ఫలితాలు చంద్రబాబుకు భారీ షాకివ్వగా 2024 ఎన్నికల ఫలితాలు సైతం అదే విధంగా ఉండే ఛాన్స్ అయితే ఉందని ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

2024 ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రావడం టీడీపీ జనసేనలకు కీలకం కాగా రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. రాయలసీమలో పవన్ కు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నా ఆ అభిమానులు పవన్ కు ఓటేస్తారో లేదో చెప్పలేం అని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో గెలవడానికి ఉన్న ఏ అవకాశాన్ని వదులుకోకూడదని టీడీపీ జనసేన భావిస్తున్నాయి.

ఈసారి ఖర్చు విషయంలో కూడా రాజీ పడకూడదని టీడీపీ ఫిక్స్ అయింది. వైసీపీకి ధీటుగా ఖర్చు చేయాలని టీడీపీ భావిస్తోంది. మరోవైపు జనసేనతో పొత్తు ఉంటుందో లేదో త్వరలో అధికారికంగా టీడీపీ నుంచి స్పష్టత రానుంది. ఏపీ భవిష్యత్తు రాజకీయాలు ఏ విధంగా ఉండబోతున్నాయనే ప్రశ్నకు రాజకీయ విశ్లేషకుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.