జగన్ కామెంట్లపై స్పందించని పవన్, చంద్రబాబు.. ఆ కామెంట్లు నిజమేగా?

AP high court notices to ap cm jagan, chandrababu and pawan kalyan

ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే రాజకీయాలు చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలలో పోటీ చేసే అవకాశం ఉన్నా జగన్ మాత్రం ఇతర రాష్ట్రాలపై దృష్టి పెట్టడం లేదు. వైసీపీని విస్తరించే దిశగా జగన్ అస్సలు అడుగులు వేయడం లేదు. జగన్ ప్రస్తుతం ఏపీలోనే నివాసం ఉంటున్నారు. ఇతర రాష్ట్రాలలో నివాసం ఉండటానికి జగన్ అస్సలు ఆసక్తి చూపడం లేదనే సంగతి తెలిసిందే.

వాస్తవానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉండి ఏపీలో అధికారం కోసం కష్టపడుతున్నారు. ప్రజల అభివృద్ధి కంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కామెంట్లు ఎప్పుడూ పొత్తుల గురించి, సీట్ల గురించి మాత్రమే ఉంటాయి. జగన్ ను ప్రతి విషయంలో ప్రశ్నించే పవన్ కళ్యాణ్ చంద్రబాబుపై ఎందుకు తీవ్రస్థాయిలో విమర్శలు చేయరు అనే ప్రశ్నకు ఆయన దగ్గర సరైన సమాధానం ఉండదనే సంగతి తెలిసిందే.

జగన్ చేసే విమర్శల గురించి స్ట్రెయిట్ గా చంద్రబాబు, పవన్ స్పందించడానికి కూడా ఇష్టపడరు. టీడీపీ, జనసేన కొత్త మేనిఫెస్టోను కూడా ప్రకటించడంలో ఫెయిల్ అవుతున్నాయంటే జగన్ ఏ స్థాయిలో పథకాలను అమలు చేస్తున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చంద్రబాబు ఏ పథకాలను అమలు చేయకుండానే లక్షల కోట్ల రూపాయల అప్పు ఎందుకు చేశారనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకడం లేదు.

టీడీపీ పాలనలో అవినీతి జరగడం వల్లే 2019 ఎన్నికల్లో తెలుగుదేశంకు ఘోర ఫలితాలు వచ్చాయి. ఆ ఫలితాల గురించి పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఒక్కసారి కూడా స్పందించలేదు. జగన్ లా సొంతంగా ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పే దమ్ము, ధైర్యం కూడా ఇతర రాజకీయ నేతలకు లేదనే సంగతి తెలిసిందే.