ఏపీలో 26 జిల్లాలు ఉన్నా చంద్రబాబు మాత్రం కుప్పం, అమరావతి మాత్రమే ఏపీలో ముఖ్యమైన ప్రాంతాలు అని మిగతా ప్రాంతాలు ముఖ్యమైన ప్రాంతాలు కావని భావిస్తారు. చంద్రబాబు నాయుడు అమరావతికి ఊహించని స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వగా పవన్ కళ్యాణ్ ఇప్పటంకు భారీ స్థాయిలో ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి ఇతర జిల్లాల ప్రజల విషయంలో ఈ నేతల అభిప్రాయం ఏంటో తెలియాల్సి ఉంది.
అమరావతి రైతులు అనే మాట బూటకమని చిన్నపిల్లాడిని అడిగినా చెబుతారు. అక్కడ భూములు కలిగి ఉన్నవాళ్లంతా రియల్టర్లు మాత్రమేననే సంగతి తెలిసిందే. అయితే ఆర్థికంగా టీడీపీకి వాళ్ల సపోర్ట్ ఎంతో అవసరమని భావించిన చంద్రబాబు ఇతర ప్రాంతాల అభివృద్ధిని విస్మరించి అమరావతిలోనే అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నారు. విజయవాడ లేదా గుంటూరులో చంద్రబాబు రాజధానిని ఏర్పాటు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు.
అయితే చంద్రబాబు మాత్రం తన సన్నిహితులతో అమరావతి పరిసర ప్రాంతాలలో భూములను కొనిపించి ఆ తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించడం జరిగింది. మరోవైపు పవన్ కళ్యాణ్ ఇప్పటం ప్రజలపై ఈగ వాలినా వెంటనే అక్కడ దర్శనమిస్తారు. మరి ఇప్పటం మినహా ఏపీలో ప్రజలెవరూ కష్టాలు పడట్లేదా అనే ప్రశ్నకు పవన్ కళ్యాణ్ సమాధానం ఇస్తే బాగుంటుంది.
జగన్ ప్రజల కోసం ఎన్నో మంచి స్కీమ్స్ ను అమలు చేస్తున్నా వాటిని విమర్శిస్తున్న చంద్రబాబు, పవన్, లోకేశ్ రాష్ట్రంలో స్వార్థ పూరిత రాజకీయాలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఈ నేతలు రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు ఇబ్బందులు కలిగేలా వ్యవహరిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.