ఎల్లో మీడియాతో ముప్పే చంద్రబాబు.. ప్రజలలా వాస్తవాలను గ్రహించొచ్చుగా?

చంద్రబాబు నాయుడు వైసీపీని, ఇతర పార్టీలను శత్రువులుగా చూస్తారు కానీ వాస్తవంగా ఆయనకు శత్రువులు ఎవరనే ప్రశ్నకు ఎల్లో మీడియా పేరు సమాధానంగా వినిపిస్తుంది. ఎల్లో మీడియాతో చంద్రబాబుకు జరిగే మేలు కంటే ముప్పు ఎక్కువగా ఉంది. చంద్రబాబుకు ఎల్లో మీడియా వల్ల టీడీపీకి సంబంధించిన వాస్తవాలు తెలియడం లేదు. 2019 ఎన్నికల ముందు ఎల్లో మీడియా చేసిన ప్రచారం అంతాఇంతా కాదు.

ఆ ప్రచారం అతి ప్రచారం కావడంతో 2019 ఎన్నికల ఫలితాల్లో టీడీపీకి భారీ షాక్ తగిలింది. కాలం మారుతున్నా ఎల్లో మీడియా అతి మాత్రం మారడం లేదు. ఏపీకి చంద్రబాబు అయితే అమరావతి అమెరికా అయిపోతుందనే రేంజ్ లో ఎల్లో మీడియా వార్తల్ని జోరుగా ప్రచారంలోకి తెస్తోంది. అయితే ప్రజలు మాత్రం జగన్ పాలన అద్భుతం అని చెప్పలేమని అదే సమయంలో చంద్రబాబు పాలనలా మాత్రం అస్సలు లేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబుకు ఈ విషయాలకు సంబంధించి ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలని మరి కొందరు చెబుతున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా నిర్ణయాల విషయంలో మారని పక్షంలో ఆ నష్టం మామూలుగా ఉండదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు ప్రస్తుతం ఏపీలో ఏ పార్టీ మంచి చేస్తుందో అవగాహన ఉంది. ఎన్ని పార్టీలు పొత్తులు పెట్టుకున్నా ఎన్నికల ఫలితాలు మారవు.

టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసినంత మాత్రాన అద్భుతాలు జరుగుతాయని ఎవరైనా భావిస్తే అంతకుమించి మూర్ఖత్వం ఉండదు. 2024 ఎన్నికల ఫలితాల్లో కూడా చంద్రబాబుకు షాక్ తగిలితే ఆ తర్వాత ఆయన మారినా పెద్దగా ఫలితం ఉండదని చెప్పవచ్చు.