చంద్రబాబు ఆలోచనా తీరు ఇప్పటికైనా మారదా.. అసలేం జరిగిందంటే?

ఏ సీఎం అయినా తన పార్టీ అధికారంలో ఉన్న సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. ఆ తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతమేర అభివృద్ధి కచ్చితంగా జరుగుతుంది. ఏ సీఎం ఇందుకు అతీతుడు కాదు. అయితే తాజాగా చంద్రబాబు మరోసారి తన గురించి తాను గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేయడం ద్వారా వార్తల్లో నిలిచారు. తన గురించి తాను గొప్పగా చెప్పుకోవడంలో చంద్రబాబు ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే.

తాజాగా చంద్రబాబు మాట్లాడుతూ తెలంగాణ నంబర్ 1 స్థానంలో నిలవడానికి తానే కారణమని కామెంట్లు చేశారు. హైదరాబాద్ ఐటీ అభివృద్ధి కోసం తానే నాంది పలికానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందడానికి తాను తీసుకున్న ఐటీ అనే ఒకే ఒక నిర్ణయం కారణమని చంద్రబాబు కామెంట్లు చేశారు. తెలంగాణలో వ్యవసాయం అభివృద్ధికి సైతం తానే నాంది పలికానని ఆయన పేర్కొన్నారు.

చంద్రబాబు కామెంట్ల గురించి కేసీఆర్, కేటీఆర్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది. చంద్రబాబు తనకు తాను గొప్పలు చెప్పుకోవడానికి బదులుగా ఏపీలో ఎన్నికల్లో ఓటమిపాలు కావడానికి కారణమేంటని ప్రశ్నించుకుంటే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. టీడీపీ పతనం ఇప్పటికైనా ప్రారంభమైందని చంద్రబాబు కామెంట్ల వల్ల ఆ పతనం మరింత వేగంగా జరుగుతుందని మరి కొందరు చెబుతున్నారు.

టీడీపీ నేతలకు ఆ పార్టీ మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే నమ్మకం లేదు. అయితే ఇతర పార్టీలతో పొత్తుల ద్వారా మళ్లీ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తుండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు నిర్ణయాలు పార్టీకి ప్లస్ అవుతాయో మైనస్ అవుతాయో చూడాల్సి ఉంది.