కియా మోటార్స్ : చంద్రబాబు మాయ

చంద్రబాబునాయుడు మాయాజాలంలో దక్షిణ కొరియా ఏమారిపోయింది. దక్షిణ కొరియాకు చెందిన కియా మోటార్స్ ఉత్పత్తి  ప్లాంటును ఏర్పాటు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కియా కార్ల ఉత్పత్తి కోసమే కొరియా తన ఉత్పత్తి ప్లాంటును అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసింది. ప్రపంచ ప్రసిద్ది చెందిన కియా మాటార్స్ తన ఉత్పత్తి ప్లాంటును ఏపిలో పెట్టడం నిజంగా గర్వకారణమే. తాజాగా కియా మోటార్స్ ప్లాంటులో మొదలైన ఉత్పత్తిని చంద్రబాబునాయుడు లాంఛనంగా ప్రారంభించారు. మొదటగా ఉత్పత్తయిన ట్రయల రన్ కారులో చంద్రబాబు తిరిగారు.  ఇక్కడే చంద్రన్న మాయాజాలం పనిచేసింది.  విచిత్రమేమిటంటే అసలు ఈ ప్లాంటులో ఇప్పటి వరకూ ఒక్క కారు కూడా తయారుకాలేదు.

మరి చంద్రబాబు తిరిగిన కారు ఎక్కడిది ? ఎక్కడిదంటే దక్షిణ కొరియా నుండి నెల రోజుల క్రితం తెప్పించింది. దాదాపు నెల రోజుల క్రితమే దక్షిణ కొరియా నుండి కియా మోటార్స్ కంపెనీ యూనిట్ 10 కార్లను తెప్పించిందట. దాంతో హడావుడిగా చంద్రబాబు కార్లు ఉత్పత్తి మొదలైపోయిందంటూ నానా హంగామా చేసి పెద్ద సభే నిర్వహించేశారు. కంపెనీనే ట్రయల్ రన్ అని స్పష్టంగా ప్రకటించిన తర్వాత చంద్రబాబు మాత్రం ఉత్పత్తి ప్రారంభమైందని ఎలా చెప్పారో అర్ధం కావటం లేదు. ఉత్పత్తి ప్రారంభం కాకుండానే ఎందుకంత హంగామా చేశారు ?

ఎందుకంటే, రానున్న ఎన్నికల్లో లబ్దిపొందేందుకు అన్నది స్పష్టమైపోతోంది. అసలు విషయం ఏమిటంటే,  కంపెనీ తన ప్రెస్ రిలీజ్ లో చెప్పిందే ఉత్పత్తి 2019 సంవత్పరం చివరలో మొదలవుతుందని. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. రాబోయే  ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి వచ్చేది అనుమానమే. అందుకనే అధికారంలోకి వచ్చే విషయంలో చంద్రబాబులో టెన్షన్ పీక్ కు చేరుకుంది. అందుకనే కార్ల ఉత్పత్తి యూనిట్ లో తయారైన మొదటి కారును తానే ప్రారంభించినట్లు బిల్డప్ ఇచ్చారు. చంద్రబాబుకు మాయలు చేయటం వెన్నతో పెట్టిన విద్యే. కానీ అదే మాయాజాలంలో ఎంతో విస్వసనీయత కలిగిన కియా మోటార్ల యాజమాన్యం కూడా ఎలా చిక్కుక్కుందో అర్ధం కావటం లేదు.