ఏపీలో జగన్ సర్కార్ తమ నేతలపై అక్రమంగా కేసులు పెడుతుందని పదే పదే ఆరోపించే చంద్రబాబు అఖిలప్రియ అరెస్ట్ విషయంలో పత్తలేకుండా పోవడం రాజకీయ వర్గాల్లో హాట్ టాఫిక్ గా మారింది. ఏపీలో అచ్చెంనాయుడు మొదలుకొని జేసీ ప్రభాకార్ రెడ్డి అరెస్ట్ వరకు అన్ని అంశాల్లో తెగ హాడవిడి చేసిన చంద్రబాబు ఇప్పుడు తన పార్టీ నేత తమ ప్రభుత్వ హాయంలో మంత్రిగా పని చేసిన భూమా అఖిల ప్రియ తెలంగాణలో వివాధాల్లో చిక్కుకొని అరెస్ట్ అయితే కనీసం కన్నేత్తి కూడా చూడడం లేద.
సందర్బం ఏదైన దాన్ని రాజకీయంగా తనకు అనుకూలంగా మార్చుకోవడంలో బాబు ను మించిన నేత మరోకరు లేరనేది జగమెరిగిన సత్యం. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో సాక్ష్యత్తు తమ పార్టీ నేత అరెస్ట్ అయిన బాబు కిక్కురు మనడం లేదు. ఇప్పుడు ఇదే అంశం రాజకీయవర్గాలను ఆకర్షిస్తోంది. బాబు మౌనం వెనుక కారణమేంటనే దానిపై జోరుగా చర్చించుకుంటున్నాయి పొలిటికల్ శ్రేణులు. మాజీ మంత్రి అచ్చెంనాయుడు అరెస్టైనప్పుడు చంద్రబాబు అతని తనయుడు లోకేష్ ఏ స్థాయిలో అక్కడ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోశారో మనకు తెలుసు. తమ పార్టీ నేతలపై ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహారిస్తోందని వాపోయారు కూడా. అదే సీన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్ట్ సమయంలో కూడా రిపీట్ అయింది.
ఏపీలో తమ నేతల అరెస్టులపై ఆ స్థాయిలో స్పందించిన చంద్రబాబు, లోకేష్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పోనీ అరెస్ట్ అయినది పార్టీలో ఒక చోటా నేత అయితే అనుకోవచ్చు తమ ప్రభుత్వ హాయాంలో మంత్రిగా చేశారు. జగన్ మోహాన్ రెడ్డిని కాదనుకొని తమ పార్టీలోకి వచ్చింది భూమా కుటుంబం. అయితే అలాంటి భూమా కుటుంబానికి బాబు ఎంతో బాసటగా ఉండాలనే వాదనలు వినిపిస్తోన్నాయి. మరో వైపు భూమ అఖిల ప్రియ కూడా పార్టీ నుంచి తనకు వస్తోన్న సహకారంపై తన సన్నిహితుల దగ్గర అసహానం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అయితే బాబు మౌనం వెనుక బలమైన కారణం కూడా లేకపోలేదు అంటున్నారు రాజకీయ శ్లేషకులు. గతంలో ఓటుకు నోటు కేసులు, కేసీఆర్ , బాబు కు మద్య ఉన్న వివాధాలు లాంటి అంశాలు చంద్రబాబును ఈ అంశంలో మాట్లాడనివ్వకుండా చేస్తోన్నాయి అంటున్నారు