చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ భేటీ.. ఏపీలో టీడీపీనే గెలవనుందా?

తెలుగుదేశం పార్టీకి గత కొన్నేళ్లుగా జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. పార్టీకి తారక్ దూరంగా ఉండటం వల్ల తారక్ అభిమానులు సైతం టీడీపీ కార్యక్రమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అయితే ఈ నెల 10వ తేదీన చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ భేటీ జరగనుందని సమాచారం అందుతోంది. ఈ భేటీ పొలిటికల్ వర్గాల్లో సంచలనం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

తారక్ టీడీపీకి సపోర్ట్ చేస్తే మాత్రం ఎంత కష్టమైనా 2024 ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ భేటీ తర్వాత తారక్ మీడియాతో మాట్లాడి టీడీపీకి మద్దతు ప్రకటించినా లేదా టీడీపీ తరపున ప్రచారం చేసినా పొలిటికల్ లెక్కలు మారతాయని చెప్పవచ్చు. చంద్రబాబును సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తుండగా ఈ విధంగా జరుగుతుందో లేదో ఇప్పుడే చెప్పలేమనే సంగతి తెలిసిందే.

చంద్రబాబు జూనియర్ ఎన్టీఆర్ భేటీ మాత్రం పొలిటికల్ వర్గాల్లో సంచలనాలు సృష్టించే అవకాశాలు అయితే ఉంటాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. అయితే చంద్రబాబు ఎన్టీఆర్ భేటీ నిజంగా జరుగుతుందో లేదో క్లారిటీ రావాల్సి ఉంది. టీడీపీ అధికార వర్గాలు ఈ భేటీ గురించి ఏ విధంగా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.

తారక్ వెకేషన్ నుంచి వచ్చిన వెంటనే ఈ భేటీ జరగనుందని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ కు సైతం రాజకీయాల్లోకి రావాలని పొలిటికల్ గా ఎన్నో విజయాలను అందుకోవాలనే కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు నెరవేరతాయో లేదో చూడాలి. తారక్ ను సీఎంగా చూడాలనే అభిమానుల ఆకాంక్ష ఎప్పటికీ నిజమవుతుందో తెలియాల్సి ఉంది.